కొత్త మిల్క్ షేక్... రూటుమార్చిన గంజాయి స్మగ్లర్లు!

గంజాయి మహమ్మారి తమ రూపాన్ని నిత్యం మార్చుకునే ప్రయత్నం చేస్తుంది! నిన్నమొన్నటివరకూ ఆకులుగానే హల్ చల్ చేసే గంజాయి

Update: 2024-04-18 04:57 GMT

గంజాయి మహమ్మారి తమ రూపాన్ని నిత్యం మార్చుకునే ప్రయత్నం చేస్తుంది! నిన్నమొన్నటివరకూ ఆకులుగానే హల్ చల్ చేసే గంజాయి.. ఇప్పుడు చాక్లెట్లు, పౌండర్ రూపాల్లోకి మారిపోయింది. ఈ క్రమలోనే ఆ పౌండర్ తో మిల్క్ షేక్ లు చేసి అమ్ముతున్నారు. ఈ సమయంలో... పాలు, హార్లిక్స్, బూస్ట్‌ లో ఈ పౌడర్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ అమ్మేస్తున్నాడు ఓ కిరాణా షాపు యజమాని. ఇది హైదరాబాద్ లో వెలుగులోకి రావడం గమనార్హం.

అవును... గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు స్మగ్లర్లు. ఈ క్రమంలో ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన స్మగ్లర్లు... తాజాగా తమ దందాను మిల్క్ షేక్ పౌడర్ రూపంలోకి మార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా మిల్క్ షేక్ లో కలిపి అందిస్తూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్నారు. ఈ మిల్క్‌ షేక్ తాగినవారు సుమారు 7 గంటల పాటు మత్తులో జోగుతున్నారని తెలుస్తుంది.

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు దాడులు చేసి... ఈ గంజాయి మిల్ షేక్ అమ్ముతున్న కిరాణ దుకాణం యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతడి దగ్గర నుంచి 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సప్లయ్ చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఆ గంజాయి పౌండర్ ను కిలో రూ.2,500 కు అమ్ముతుండగా.. గంజాయి పొడితో చేసిన చాక్లెట్‌ ఒక్కోటి రూ.40కి విక్రయిస్తున్నారు. కోల్‌ కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలిందని తెలుస్తుంది. ఇలా ఈ సమ్మర్ లో ఎక్కువగా తాగే మిల్క్ షేక్ లో గంజాయి పౌండర్ కలిపి తాగితే మంచి ఆరోగ్యమని ప్రచారం చేస్తూ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు!

ఈ క్రమంలో... తల్లితండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని, నిన్నమొన్నటి వరకూ విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు ఇచ్చి వారి జీవితాలను నాశనం చేసినట్లే.. ఈ తరహా మిల్క్ షేక్ లు ఇచ్చి ఆకట్టుకునే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు!

Tags:    

Similar News