అదానీకి USA లోన్ ఇవ్వడం అవసరమా?
గౌతమ్ అదానీ.. భారత దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగానే కాకుండా.. అపర కుబేరిడిగా కూడా పేరు తెచ్చుకున్నారు
గౌతమ్ అదానీ.. భారత దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగానే కాకుండా.. అపర కుబేరిడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఈయనపై గత ఆరు మాసాల కిందట... అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంచ లన నివేదిక వెల్లడించడం.. ఇది రాజకీయ దుమారానికి దారితీయడం తెలిసిందే. ఏకంగా పార్లమెంటు ను కూడా ఈ విషయం కుదిపేసింది. ముఖ్యంగా ఆయన ఆస్తులకు సంబంధించి.. ఆయన చూపుతున్న లెక్కలకు వాస్తవ వివరాలకు తేడా ఉందన్నది ప్రధాన ఆరోపణ.
ఆయన లెక్కలు దాస్తున్నారని కూడా హిండెన్‌బర్గ్ వెల్లడించింది. దీనిపై భారత ప్రభుత్వం మౌనం వహించింది. ముఖ్యంగా ప్రధాని మోడీ.. దేశవ్యాప్తంగా చర్చ జరిగినా.. పార్లమెంటులో దుమ్ము రేగినా.. మౌనంగా ఉండిపోయారు. అయితే.. అమెరికా మాత్రం హిండెన్ బర్గ్ నివేదికను ప్రధానంగా పరిశీలించడం గమనార్హం. ఎందుకంటే.. అదానీ అక్కడ అప్పులు చేసినట్టు తెలిసింది. ఈ అప్పులు ఇచ్చేముందు.. అదానీ ఆదాయ వ్యయాలు.. ఆస్తులను పరిశీలించినట్టు అమెరికా వెల్లడించింది.
అదానా పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు... సంబంధించి అన్ని వివరాలు పరిశీలించినట్టు తెలిపింది. అయితే.. ఈ ఆరోపణల్లో వాస్తవాలు లేవని.. హిండెన్‌బర్గ్ పేర్కొన్న వివరాలు.. సరికాదని తేల్చడం గమనార్హం. ఇదిలావులంటే.. శ్రీలంకలో కంటైనర్ పోర్టు నిర్మించేందుకు అదానీ.. అమెరికా నుంచి 553 మిలియన్ డాటర్లు(50 వేల కోట్లు) అప్పుగా తీసుకున్నారు.
అయితే.. ఇలా అమెరికా అదానీకి క్లీన్ చిట్ ఇవ్వడం .. రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ప్రదాని మోడీ అమెరికాలో పర్యటించిన నేపథ్యంలో నాలుగు మాసాల తర్వాత.. అదానీకి అనుకూలంగా అమెరికా వ్యవహరించడంతో ప్రసస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఏం జరుగుతుందో చూడాలి.