పరారీలో జగన్ ప్రియ శిష్యుడు!... హత్య, హత్యాయత్నంతో పాటు 42 కేసులు!

వైసీపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి వ్యవహారం ఇప్పుడు విజయవాడ నేరవార్తల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.

Update: 2024-11-15 06:21 GMT

వైసీపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి వ్యవహారం ఇప్పుడు విజయవాడ నేరవార్తల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. విజయవాడలో కలకలం రేపిన సుపారీ గ్యాంగ్ తో హత్యాయత్నం కేసులో ప్రధాన సూత్రదారి ఈయనే అని చెబుతూ... పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

అవును... విజయవాడలో ఓ స్థలాన్ని కబ్జా చేసి, దాని యజమానిని అడ్డు తొలగించేందుకు ఓ ముఠాతో రూ.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు గౌతం రెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు స్పందిస్తూ... అరెస్టు కాబడిన నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా... వైసీపీ నేత గౌతంరెడ్డిపై ఉన్న కేసుల వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద అతనిపై 42 కేసులు ఉన్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో... అతనిపై 1988 నుంచి కేసులు ఉన్నాయని.. ఒక్క సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారు 23 కేసులు నమోదయ్యాయని సీపీ వెల్లడించారు. వాటిలో రెండు హత్య, రెండు హత్యాయత్నం తో పాటు దోపిడీ, చీటింగ్ వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయని.. కొట్లాట, దౌర్జ్యన్యం వంటి కేసులూ ఉన్నాయని తెలిపారు.

తాజా కేసు ఏమిటంటే...?:

విజయవాడ వాసి గండూరి ఉమామహేశ్వరశాస్త్రి... తన తల్లి పేరిట ఉన్న 325 గజాల స్థలాన్ని గౌతంరెడ్డి తప్పుడు పత్రలతో కబ్జా చేశారని, దాంట్లో రేకుల షెడ్ నిర్మించారని 2017లోనే గుర్తించారంట. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయడం, వారు నోటీసులు ఇవడం, గౌతం రెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగిందని అంటున్నారు.

అయితే... 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే దాన్ని గౌతంరెడ్డి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలో తనకు అన్యాయం జరిగిందంటూ శాస్త్రి.. సోషల్ మీడియా వేదికగా వీడియోలు పెట్టడం చేశారు. దీంతో.. ఇది సహించలేకపోయినా గౌతం రెడ్డి అతడిని హతమర్చాలని నిర్ణయించుకున్నారంట.

దీనికోసం రూ. 25 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఓ గ్యాంగ్ ను నియమించినట్లు విచారణలో తెలిందని సీపీ చెబుతున్నారు. ఈ క్రమంలో శాస్త్రి ఇంటివద్ద అక్టోబర్ 31 న రెక్కీ నిర్వహించి.. నవంబర్ 6న హత్యకు యత్నించారని.. ఈ సమయంలో శాస్త్రి కేకలు వేయడంతో అతని ఫోన్, డాక్యుమెంట్స్ ఉన్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లారని అంటున్నారు.

ఈ సమయంలో వారు వాడిన బైక్, కారు వివరాలను పరిశీలించడంతో.. కారు, గౌతం రెడ్డి లీగల్ వ్యవహారాలు చూసే పురుషోత్తంది అని.. బైక్ విజయవాడకు చెందిన పృథ్వీరాజ్ ది అని గుర్తించారంట. ఆ విధంగా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నవారిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురితో పాటు గౌతం రెడ్డి పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.

టీడీపీ ఎక్స్ లో పోస్ట్!:

ఈ వ్యవహరంపై టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా... "తన సైకో బాస్ బాబాయ్ ని వేసేసిన అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని, రూ.24 లక్షల సుపారీ ఇచ్చి, విజయవాడలో బ్రాహ్మణుడిని చంపాలని ప్లాన్ చేశారు జగన్ ప్రియ శిష్యుడు గౌతంరెడ్డి. దానిని పోలీసులు పసిగట్టి నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గౌతం రెడ్డికోసం పోలీసులు గాలిస్తున్నారు" అని పోస్ట్ చేసింది.

Tags:    

Similar News