లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. కీలక పరిణామాలు.. అరెస్టు?

అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే... తాజాగా ఈ కేసుకు సంబందించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.;

Update: 2025-02-10 04:16 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేత్రత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. వెలుగు చూసిన తిరుమల శ్రీవారికి నైవేధ్యంగా పెట్టే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆరోపణ పెద్ద ఎత్తున్న రావటం.. దీనిపై పెను దుమారం రేగటం తెలిసిందే. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే... తాజాగా ఈ కేసుకు సంబందించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే.. తమిళనాడుకు చెందిన ఏఐ డైయిరీ, యూపీ (ఉత్తరప్రదేశ్)కి చెందిన పరాగ్ డెయిరీ.. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్.. ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు సంబంధించిన కీలక వ్యక్తుల్ని మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు టీం.. లడ్డూ ప్రసాదంలో వినియోగించిన ఆవునెయ్యి కల్తీగా పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని సంచలనంగా మారనున్నట్లుగా చెబుతున్నారు.

దీనికి కారణం కల్తీ నెయ్యి ఉదంతంలో కొన్ని కంపెనీల ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాలు లభ్యం కావటంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల ఆవశేషాలు ఉన్నట్లుగా ఆరోపణలు రావటం.. ఇది కాస్తా పెను సంచలనంగా మారటం తెలిసిందే. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా మారిన ఈ ఇష్యూపై పూర్తిస్థాయి విచారణను కోరుతూ కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించటం తెలిసిందే.

దీనిపై స్పందించిన సుప్రీం.. సీబీఐ నేత్రత్వంలో పూర్తిస్థాయి టీం ఏర్పాటైంది. పలు దఫాలుగా విచారణను నిర్వహించిన ఈ టీం సభ్యులు తిరుమల.. తిరుపతితో పాటు నెయ్యిని సప్లై చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీలోనూ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డెయిరీ పలు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో నెయ్యిని సరఫరా చేయటానికి ఉత్తరాదికి చెందిన పలు డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో ఏఆర్ డెయిరీకి సహకరించిన పలువురు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్.. పరాగ్ డెయిరీ.. ఆల్ఫా మిల్క్ ఫుడ్స్.. ఏఆర్ డెయిరీకి చెందిన పలువురి సీబీఐ టీం అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ రోజు (సోమవారం) వీరిని కోర్టు ఎదుట హాజరుపర్చే అవకాశం ఉందంటున్నారు.

Tags:    

Similar News