"పవన్ కల్యాణ్‌కు మైండ్ దొబ్బింది.. నిన్న ఇలా.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నాడు''
అంతేకాదు.. మన కాపు నాయకుడేనని చెప్పారని, కానీ, ఇప్పుడు మతి స్థితిమితం లేకుండా మాట్లాడుతు న్నాడని విమర్శించారు
''జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మైండ్ దొబ్బింది.. నిన్న ఇలా.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నాడు'' అని వైసీపీ ఎమ్మెల్యే, భీమవరం శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత నెలలో భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ తనపై కోపం లేదని అన్నాడని చెప్పారు. అంతేకాదు.. మన కాపు నాయకుడేనని చెప్పారని, కానీ, ఇప్పుడు మతి స్థితిమితం లేకుండా మాట్లాడుతు న్నాడని విమర్శించారు.
''నన్ను రౌడీ అంటున్నాడు. భీమవరంలో ఆయన స్థలం కొందామనుకుంటే నును అడ్డుకున్నానని అంటున్నాడు. ఆయన మానసిక స్థితి సరిగా లేదు. మైండి దొబ్బింది. భీమవరంలో సగానికి పైగా పేదలు ఉన్నారు. కానీ, పవన్‌కు ఇక్కడ ప్రపంచ కుబేరులు కనిపిస్తున్నారంట. భీమవరంలో అటువంటివారు ఎక్కడున్నారో చూపిస్తే మంచిది. నేను కూడా వారిని పరిచయం చేసుకుంటా'' అని ఘాటుగా విమర్శించారు.
అంతేకాదు.. పవన్ కు తనమీద ఎందుకంత అసూయ అని గ్రంధి ప్రశ్నించారు. ''నీకు, నా పార్టీ కార్యాల యానికి స్థలం కావాలంటే నాకున్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెపితే అక్కడ ఇస్తా'' అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలకు గ్రంధి శ్రీనివాస్ కొన్ని సూచనలు చేశారు. జనసేన కార్యకర్తలు తనకు సలహాలు ఇవ్వొద్దని పవన్ డైరెక్ట్ గా చెపుతున్నాడని, అలాంటి నాయకుడితో తిరిగి, టీడీపీ, బీజేపీ జెండాలు మోయడం మీకు అవసరమా? అని ప్రశ్నించారు.
పవన్ నిజ స్వరూపం తెలియని అభిమానులు సీఎం సీఎం అంటుంటారని... ఆయన మాత్రం 21 సీట్లకే పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు అసలు పోలికే లేదని అన్నారు. సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని గ్రంధి మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ భీమవరం ముఖమే చూడలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పవన్ నమ్ముకుంటే.. కార్యకర్తలు నిలువునా మోస పోవడమేనని అన్నారు.