మోడీ తాజా పిడుగు? రూ.2వేల లోపు డిజిటల్ పేమెంట్లకు జీఎస్టీ?

తాజాగా రూ.2వేల లోపు డిజిటల్ చెల్లింపులపైనా 18శాతం జీఎస్టీ వసూలు చేసేలా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Update: 2024-09-07 04:32 GMT

నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఖర్చు చేసే ప్రతి రూపాయికి జీఎస్టీ వసూలు చేసే కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పుడు చిన్న పేమెంట్ల (రూ.2వేల కంటే తక్కువ డిజిటల్ పేమెంట్లు) మీదా కన్నేసిందా? అంటే అవునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ2వేల లోపు లావాదేవీలపై జీఎస్టీ విధించమని చెప్పిన మోడీ సర్కారు ఇప్పుడు ఆ భారం మోపేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. రోజర్ పే.. పైన్ లాబ్స్ లాంటి పేమెంట్ అగ్రిగేటర్ల ద్వారా జరిపే చెల్లింపులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం.

ఇప్పటివరకు ఈ పేమెంట్లను డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డుల ద్వారా చేస్తున్నారు. వీటితో రూ.2 వేల కంటే ఎక్కువ చెల్లంపులపై జీఎస్టీ ఇప్పటికే వసూలు చేస్తున్నారు. తాజాగా రూ.2వేల లోపు డిజిటల్ చెల్లింపులపైనా 18శాతం జీఎస్టీ వసూలు చేసేలా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలి పరిశీలిస్తున్నట్లు తెలుసతోంది. సోమవారంఢిల్లీలో జరిగే జీఎస్టీ సమావేశంలో ఇందులో చర్చిస్తారని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ ఆగ్రిగేటర్లు ఒక్కో లావాదేవీ మీద 0.5 శాతం నుంచి 2 శాతం వరకు పేమెంట్ గేట్ వే ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇలాంటి వేళ.. అదనంగా జీఎస్టీ విధిస్తే.. అది కూడా వినియోగదారుడి మీదే భారం పడుతుంది. మరి.. ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ.. దీన్ని జీఎస్టీ కిందకు చేర్చాలని భావిస్తేమోడీ సర్కారు మరో భారీ దెబ్బ వేసినట్లేనన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News