గుడ్డు మంత్రీ... నీకు అవసరమా ?

గుడ్డు మంత్రి అంటే అందరికీ ఈ పాటికి బోధపడే ఉంటుంది. ఆయనను ఆ పేరుతో తెగ ట్రోల్స్ చేసి చివరికి అదే ట్యాగ్ ని సార్ధకం చేశారు.

Update: 2024-08-20 10:48 GMT

గుడ్డు మంత్రి అంటే అందరికీ ఈ పాటికి బోధపడే ఉంటుంది. ఆయనను ఆ పేరుతో తెగ ట్రోల్స్ చేసి చివరికి అదే ట్యాగ్ ని సార్ధకం చేశారు. విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్ ని గుడ్డి మంత్రిగా సోషల్ మీడియా ఏనాడో నామకరణం చేసింది. గుడివాడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయన ఇపుడు మీడియా ముందుకు తరచూ వచ్చి టీడీపీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.

ఇక వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ని ఇరుకున పెట్టిన వారిలో గుడ్డు మంత్రి గుడివాడ కూడా ఒకరు అని చెబుతారు. ఆయన తనకు అప్పగించిన కీలకమైన మంత్రిత్వ శాఖల విషయంలో తగిన తీరున పని చూపించలేకపోయారు అని కూడా విమర్శలు ఉన్నాయి. ఆయన రాజకీయ జీవితం చూస్తే ఒక్కసారి గెలిచారు. అది కూడా అనకాపల్లి ఎమ్మెల్యేగా జగన్ వేవ్ లో.

ఆయన 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ గాజువాక నుంచి పోటీ చేసి ఏకంగా ఏపీలోనే అతి పెద్ద మెజారిటీతో ఓటమి పాలు అయిన వారుగా రికార్డు సృష్టించారు.

జగన్ యువతను ప్రోత్సహిద్దామనుకుని గుడివాడను తెచ్చి ముందు వరసలో పెట్టారు. అలా ఆయనకు అనేక అవకాశాలు దక్కాయి. అయితే వచ్చిన వాటిని గుడివాడ సద్వినియోగం చేసుకోలేకపోయారు అన్నది కూడా ఒక విమర్శ గానే ఉంది. ఐటీ భారీ పరిశ్రమలు మౌలిక సదుపాయాలు ఇలా కీలకమైన మంత్రిత్వ శాఖలను జగన్ గుడివాడకు ఇస్తే ఎలా రాజకీయంగా బలోపేతం కావాలో కూడా గుడివాడ సరైన ప్లాన్ చేసుకోలేకపోయారు అని అంటారు.

ఇక మీడియా బేబీ గానే ఎపుడూ ఉంటూ వచ్చారు. పైగా తన శాఖకు సంబంధం లేని విషయాల మీద మాట్లాడడం, ఆనాటి విపక్షాల మీద పెద్ద నోరు చేసుకోవడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ల మీద ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేయడం ద్వారా గుడివాడ మంత్రిగా ఎంతగానో తన గ్రాఫ్ ని తానే తగ్గించేసుకున్నారు అని కూడా విమర్శలు ఉన్నాయి.

ఇక ఐటీ మినిస్టర్ గా ఒక్క ముక్క కూడా మీడియాలో మాట్లాడలేని విధంగా గుడివాడ వ్యవహార శైలి ఉందని కూడా అంతా అన్న నేపథ్యం ఉంది. అటువంటి గుడివాడ ఇపుడు పీసీసీ ఏపీ చీఫ్ షర్మిల మీద విమర్శలు చేయడం అవసరమా అన్న చర్చ కూడా సాగుతోంది.

వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్యన వివాదం ఏమైనా ఉంటే అది వారి ఇంటర్నల్ మ్యాటర్ వారు చూసుకుంటారు. మధ్యలో గుడివాడకు ఎందుకు అన్న చర్చ కూడా వస్తోంది. మధ్యలో గుడివాడ దూరి ఈ విధంగా బిగ్ సౌండ్ చేయడం వల్ల ఆయనకే ఇబ్బంది అవుతుందని అంటున్నారు.

నిజానికి చూస్తే గుడివాడకు నోటి దూల ఎక్కువ అని విశాఖలోని రాజకీయంగా టాక్ ఉంది అని కూడా అంటారు. ఆయన నోటి దురద వల్లనే చిన్న వయసులోనే పొలిటికల్ కెరీర్ కూడా ట్రబుల్స్ లో పడుతోందని కూడా అంటున్నారు. గుడివాడ రాజకీయ కుటుంబానికి చెందిన వారు, తాత తండ్రి ఇద్దరూ రాజకీయంగా రాణించారు.

ఆ ఇంటి పేరు చెప్పుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన గుడివాడ తమ పెద్దల గౌరవాన్ని నిలబెట్టేలా గుడివాడ పొలిటికల్ లెగసీని పదికాలాల పాటు కొనసాగేలా చూడాలి తప్పించి మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

వయసు ఇంకా చిన్నది రాజకీయంగా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. గుడివాడ ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా రాజకీయం అంటే ఎదుటి వారిని నిందించడంలో ఘాటు విమర్శలు చేయడమో అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఉండదని అని అంటున్నారు. రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా ఉంటేనే కెరీర్ బాగుంటుంది అని సలహా ఇస్తున్న వారూ ఉన్నారు.

ఏది ఏమైనా గుడివాడ గుడ్డు మంత్రి అన్న ట్యాగ్ ని తగిలించుకున్నా ఇంకా తత్వం బోధపడలేదని కామెంట్స్ వస్తున్నాయి. విపక్షంలోకి వచ్చిన తరువాత కాస్తా సహనంతో ప్రజల పక్షాన అవసరమైన సబ్జెక్టులను తీసుకుని మాట్లాడితే గుర్తింపు ఉంటుంది కానీ సంచలనాల కోసం హాట్ కామెంట్స్ చేయడం వల్ల తెర మరుగు అవడం తప్ప మరోటి ఉండదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News