జ్ఞానవాపి మసీదులో సర్వే స్టార్ట్... హాట్ టాపిక్ గా సుప్రీంలో కేసు!
అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో పురావస్తు శాఖ సర్వే ప్రారంభించింది
అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో పురావస్తు శాఖ సర్వే ప్రారంభించింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య శుక్రవారం నుంచి సర్వే ప్రారంభించింది. సర్వే బృందంలో 41 మంది అధికారులు ఉన్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
అవును... జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో పురావస్తు శాఖ స్పీడ్ పెంచింది. సర్వే ప్రారంభించింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఈ సర్వే కొనసాగుతోంది.
మొఘలుల కాలంలో నిర్మించిన ఈ మసీదు స్థలంలో అంతకు పూర్వం హిందూ దేవాలయం ఉండేదని.. అక్కడున్న ఆలయాన్ని కూల్చివేశారని.. మసీదు ఆవరణలో సర్వే జరిపితే అసలు నిజాలు బయటపడతాయని కొందరు హిందూ మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలుు చేశిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన వారణాసి హైకోర్టు. మసీదులో సర్వే జరిపేందుకు పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వేపై ధర్మాసనం స్టే విధించింది. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలంటూ పిటిషనర్లకు సూచించింది.
దాంతో పిటిషనర్లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... మసీదులో సర్వే చేయాల్సిందిగా పురావస్తుశాఖను ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏ.ఎస్.ఐ) సర్వే ప్రారంభమవుతుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
ఈ సంగతి ఇలా ఉంటే... మరోవైపు జ్ఞాన్ వాపి మసీదు ప్రాంగణంలో ఏ.ఎస్.ఐ సైంటిఫిక్ సర్వే నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు విచారణ జరుపనుందని ఈ కేసులో తరఫు న్యాయవాదులు చెబుతున్నారని తెలిసింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సర్వే ప్రారంభమైన నేపథ్యంలో... సుప్రీం కోర్టు ఎలా స్పందచబోతోందనేది ఆసక్తిగా మారింది.