హార్దిక్ పాండ్యా విడాకులు.. ఆస్తుల విషయంలో నో వర్రీ!
హార్దిక్- నటాషా విడాకులకు సిద్ధమయ్యారని జాతీయ మీడియాలు తమ కథనాల్లో ఉటంకిస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతడి భార్య నటాషా స్టాంక్విక్ వ్యక్తిగత జీవితంలో కలతలు తలెత్తాయని జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. పెళ్లయి నాలుగేళ్లు గడుస్తున్నా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని ఇటీవల పుకార్లు వచ్చాయి. హార్దిక్- నటాషా విడాకులకు సిద్ధమయ్యారని జాతీయ మీడియాలు తమ కథనాల్లో ఉటంకిస్తున్నాయి. సెర్బియా నటి కం మోడల్ నటాషా పాండ్యాను ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇంటిపేరు నుండి తొలగించిన తర్వాత వారు విడిపోయారనే పుకార్లు దావానలంలా వ్యాపించాయి.
ఇంతలోనే హార్థిక్ కి చెందిన 70శాతం ఆస్తులు నటాషాకి వెళ్లిపోతాయంటూ నెటిజనుల్లో మరో కొత్త పుకార్ వైరల్ అయింది. ఇప్పుడు ఒక వైరల్ వీడియోలో హార్దిక్ పాండ్యా తన డబ్బు ఇతర ఆస్తులన్నీ తన తల్లి నియంత్రణలో ఉన్నాయని వెల్లడించాడు. గౌరవ్ కపూర్ `బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్` షోలో అతడు ఆస్తుల గురించి వెల్లడించాడు. ఆర్థిక వ్యవహారాల్లో తనను తాను విశ్వసించనందున తన సంపదలో సగం తన తల్లికి బదిలీ చేసినట్లు వెల్లడించాడు.
హార్దిక్ తల్లి వారి ఆస్తిలో భాగస్వామిగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. కారు బంగ్లా సహా ఖరీదైన ఆస్తులన్నీ తన అమ్మ పేరుతోనే ఉన్నాయని హార్దిక్ చెప్పాడు. తన పేరు మీద ఏమీ తీసుకోనని భవిష్యత్తులో ఎవరికీ 50 శాతం ఇవ్వకూడదని కూడా చెప్పాడు. అయితే ఇది 2018 నాటి వీడియో క్లిప్. కానీ ప్రస్తుత సందర్భానికి అన్వయిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నెటిజనులు అతడి దూరాలోచనను విజనరీ అని ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ ``బాగా ఆడారు`` అని సెటైరికల్‌గా రాసారు. మరొకరు ``అమ్మా.. అన్ని ఆస్తులను సురక్షితంగా ఉంచారు`` అని వ్యాఖ్యానించారు.
ఒక రెడ్డిట్ యూజర్ హార్దిక్ -నటాషా ఇద్దరూ ఒకరితో ఒకరు ఫోటోలు పోస్ట్ చేయడం లేదని, 2024 IPL మ్యాచ్‌కు కూడా నటాషా హాజరు కాలేదని కూడా పేర్కొన్నారు. మార్చి 4న బర్త్ డే సందర్భంగా హార్థిక్ తన భార్యకు విషెస్ చెప్పలేదని కూడా గుర్తు చేసాడు. ఇవన్నీ హార్థిక్ - నటాషా బ్రేకప్‌కి ఆధారాలు అంటూ విశ్లేషించారు. హార్దిక్ 2020లో నటాషాను వివాహం చేసుకున్నారు. ఈ జంట అగస్త్య అనే మగపిల్లాడికి తల్లిదండ్రులు.