దేశ రాజధానిగా ఢిల్లీ బదులు కొత్త నగరం ?

దేశంలోని నూటా నలభై అయిదు కోట్ల మందికి ఏకైన మహా నగరం రాజధానిగా ఉంది. దీంతో ఢిల్లీకి ట్రాఫిక్ ఎక్కువే.

Update: 2024-11-20 04:00 GMT

భారత దేశానికి రాజధాని ఢిల్లీ. ఇది దశాబ్దాలుగా వస్తోంది. స్వాతంత్రం వచ్చిన తరువాత గత ఏడున్నర దశాబ్దాల కాలంలో ఢిల్లీనే రాజధానిగా చేసుకుంటూ పాలన చేస్తున్న నేపధ్యం ఉంది. అటువంటి ఢిల్లీలో రాజకీయ కార్యకలాపాలు ఎక్కువ.

దేశంలోని నూటా నలభై అయిదు కోట్ల మందికి ఏకైన మహా నగరం రాజధానిగా ఉంది. దీంతో ఢిల్లీకి ట్రాఫిక్ ఎక్కువే. కిటకిటలాడుతూ జనాలు ఉంటారు. ఇక ఢిల్లీలో కిక్కిరిసిన జనాభాకు తోడుగా కాలుష్యం కూడా విచ్చలవిడిగా కమ్ముకుంటోంది. ప్రతీ ఏటా శీతాకాలం వస్తే చాలు మూడు నెలల పాటు ఢిల్లీలో అన్నీ మూసుకుని కూర్చోవాల్సిందే. పొగమంచు మితిమీరిన కాలుష్యంతో ఢిల్లీలో అన్నీ బంద్ కావాల్సిందే. ఎటు చూసినా ఇబ్బందులతో అవస్థ పడాల్సిందే.

నవంబర్ నుంచి మొదలైన కాలుష్యం జనవరి ఎండింగ్ వరకూ అలా ఉంటూనే ఉంటుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. కాలుష్యం దారుణంగా పెరిగిన క్రమంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయిదు వందల మార్క్ కి పై దాటుతోంది. దాంతో బాబోయ్ ఢిల్లీ అని అంటున్నారు

ఢిల్లీ చుట్టు పక్కన ఉన్న హర్యానా పంజాబ్ యూపీ రైతులు తమ పంట వ్యర్ధాలను తెచ్చి రోడ్ల మీద తగులబెట్టడం వల్ల కూడా ఢిల్లీలో కాలుష్యం దారుణంగా పెరిగిపోతోంది. దీంతో శ్వాస కోశ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి.

ఢిల్లీ నివాస యోగ్యమైన నగరం కాదా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం కలిగిన నగరంగా ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని అంటున్నారు. మరి ఢిల్లీని ఇలాగే రాజధానిగా కంటిన్యూ చేస్తే రాబోయే రోజులలో కష్టమే అని అంటున్నారు.

రాజధానిగా దేశానికి ఢిల్లీ పనికి రాదు అని అంటున్నది కాంగ్రెస్ కి చెందిన లోక్ సభ సభ్యుడు శశి ధరూర్. ఆయన తన ట్విట్టర్ ద్వారా ఈ కామెంట్స్ చేశారు. ఢిల్లీకి బదులుగా వేరే రాజధాని నగరాన్ని చూసుకోవాల్సిందే అంటున్నారు.

ఢిల్లీలో అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఇతర నగరాలతో పోలిస్తే నానాటికీ ఢిల్లీ నగరం నివాసానికి యోగ్యం కాదని అర్ధం అవుతోందని ఆయన అంటున్నారు. శీతాకాలమంతా ఈ విధంగా ఉంటే మిగిలిన కాలాలూ ఢిల్లీలో దుర్బరమే అని ఆయన అంటున్నారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్రం పెద్దగా కృషి చేయడం లేదని అందువల్ల దేశానికి వేరే రాజధానిని చూసుకోవడం బెటర్ అని ఆయన మనసులోని మాటను కుండబద్దలు కొట్టేశారు.

మరి ఇది ఇపుడు వైరల్ అవుతోంది. ఒక విధంగా చర్చగానూ సాగుతోంది. ఢిల్లీ కాకుండా వేరే రాజధానిని చూసుకోవాల్సిందేనా అని కూడా అంటున్నారు. మరి అలా జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే నానటికీ ఏ ఏటికి ఆ ఏడూ ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారుతోంది అన్నది వాస్తవం అంటున్నారు అంతా.

Tags:    

Similar News