19+3 మందితో హెలీకాప్టర్ అదృశ్యం.. ఏమి జరిగింది?

అవును... రష్యా తూర్పు ప్రాంతంలోని కంచత్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉన్నపలంగా అదృశ్యమైపోయింది.

Update: 2024-08-31 15:30 GMT

తాజాగా ఓ హెలీకాప్టర్ అదృశ్యమైన ఘటన తెరపైకి వచ్చింది. 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో బయలుదేరిన ఓ హెలీకాప్టర్ కాసేపటి తర్వాత కనిపించకుండా పోయింది. గమ్యస్థానానికి చేరుకుంటుందని చూస్తున్న వేళ.. ఈ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సమయంలో... అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

అవును... రష్యా తూర్పు ప్రాంతంలోని కంచత్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉన్నపలంగా అదృశ్యమైపోయింది. ఎంఐ-8టీ సిరీస్ కు చెందిన ఈ హెలీకాప్టర్ వచ్కజెట్స్ అగ్నిపర్వతం సమీపం నుంచి బయలుదేరింది. కానీ.. గమ్యస్థానానికి చేరుకోలేదు. ఈ విషయాన్ని ఫెడరల్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ కూడా ధృవీకరించింది.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం... హెలీకాప్టర్ వచ్కజెట్స్ అగ్నిపర్వతం సమీపంలో ఉన్న ప్రదేశం నుంచి బయలుదేరిన తర్వాత.. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని.. ఇందులో భాగంగా చినుకులు, పొగమంచు గమనించినట్లు రష్యా ప్రభుత్వ మీడియా నివేదించింది. అయితే.. విమాన సిబ్బంది నుంచి ఎలాంటి లోపాలను నివేదించలేదని వెల్లడించింది.

కాగా... ఈ హెలీకాప్టర్ ను 1960ల్లో డిజైన్ చేశారు. ఈ సిరీస్ హెలీకాప్టర్ లను రష్యా, దాని పొరుగు దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే... ఈ ఏడాది అగస్టులోనే కంచత్కాలో ఇలాంటి హెలీకాప్టరే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇందులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. నాడు ఈ హెలీకాప్టర్ మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ కు పర్యాటకులను తరలిస్తోంది!

Tags:    

Similar News