సింహాలకు అక్బర్, సీత పేర్లు.. ఒకే ఎన్ క్లోజర్.. హైకోర్టు సీరియస్!

అవును... పశ్చిమ బెంగాల్‌ లోని శిలిగురి సఫారీ పార్కులోని రెండు సింహాలకు అక్బర్, సీత అని పేర్లు పెట్టి వాటిని ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచారు!

Update: 2024-02-23 06:42 GMT

భారతదేశంలో భిన్న మతాల మధ్య ఎంత సామరస్య పూర్వక వాతావరణం ఉంటుందో.. కొన్ని సందర్భాల్లో అంతకు మించిన సమస్యాత్మక పరిస్థితులు నెలకొంటాయని చెబుతుంటారు! ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని అంటుంటారు! ఆ సంగతి అలా ఉంటే... పశ్చిమ బెంగాల్ శిలిగురిలోని సఫారీ పార్కులో రెండు సింహాలకు అటవీ శాఖ అధికారులు "సీత", "అక్బర్" అనే పేర్లు పెట్టారు. ఇప్పుడు ఈ విషయంపై కోర్టు ఘాటుగా స్పందించింది.

అవును... పశ్చిమ బెంగాల్‌ లోని శిలిగురి సఫారీ పార్కులోని రెండు సింహాలకు అక్బర్, సీత అని పేర్లు పెట్టి వాటిని ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచారు! ఈ వ్యవహారంపై కోల్ కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా తక్షణమే వాటి పేర్లు మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ సౌగత్‌ భట్టాచర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యాలు చేశారని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... బెంగాల్ సఫారీ పార్క్‌ లో ఉన్న సింహాలలో ఆడ సింహానికి సీత అని, మగ సింహానికి అక్బర్ అని నామకరణం చేశారు. ఇదే సమయంలో వీటిని కలిపి ఉంచాలని నిర్ణయించారని తెలుస్తుంది! దీంతో ఈ విషయంపై విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా... ఆ సింహాల పేర్లను మార్చాలని కోరింది.

ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి జస్టిస్‌ సౌగత్‌ భట్టాచర్య సంచలన వ్యాఖ్యలు చేశారు! ఇందులో భాగంగా... ఇలాంటి పనులు చేసి అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో... "మీ మీ పెంపుడు జంతువులకు హిందూ దేవుడు, ముస్లిం ప్రవక్తల పేర్లు పెడతారా..? జంతువులను అక్బర్, సీత అని పిలవడమేంటి? రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ పేరును ఒక జంతువుకు ఊహించగలమా..?" అని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో... "ఈ దేశంలో సీతను ఎంతో మంది పూజిస్తారు. ఇదే సమయంలో... అక్బర్‌ పేరు సింహానికి పెట్టడాన్ని కూడా వ్యతిరేకిస్తాను. ఆయన చాలా సమర్థుడైన, లౌకిక మొగల్‌ చక్రవర్తి" అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో ఆ సింహాలు 2016, 2018ల్లో త్రిపుర నుంచి వచ్చాయని.. అవి వచ్చినప్పుడే ఆ పేర్లతో ఉన్నాయని.. ఇప్పుడు వాటిని మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు.

Tags:    

Similar News