సెబీ చీఫ్ ను వెంటాడుతున్న హిండెన్ బర్గ్... మరోమారు కీలక ఆరోపణలు!

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందన మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతుందంటూ మరోసారి తగులుకుంది హిండెన్ బర్గ్!

Update: 2024-08-12 07:05 GMT

గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్, సెబీ చైర్ పర్సన్ మాధబి బచ్ లపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు అదానీ గ్రూప్ నుంచి, ఇటు మాదభి దంపతుల నుంచి ఈ ఆరోపణలపై వివరణ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందన మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతుందంటూ మరోసారి తగులుకుంది హిండెన్ బర్గ్!

అవును... హిండెన్ బర్గ్ తనపైనా, తన భర్తపైనా చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్ మాధబి బచ్ స్పందించన సంగతి తెలిసిందే. అయితే... తమ ఆరోపణలను ఖండిస్తూ ఆమె చేసిన ప్రకటన మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతోందని హిండెన్ బర్గ్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఎక్స్ లో స్పందించిన హిండెన్ బర్గ్... మాధబి స్పందనలో ఆమెకు మారిషస్ లేదా బెర్ముడా లో ఫండ్స్ ఉన్నాయనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని పేర్కొంది.

ఇదే సమయంలో... ఆమె ఇచ్చిన వివరణలో ఫండ్స్ ధృవీకరణతో పాటు ఆ ఫండ్స్ ను ఆమె భర్త ధావల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని పేర్కొంది. అదేవిధంగా... మాధబి భర్త చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు అదానీ గ్రూప్ లో డైరెక్టర్ గా చేస్తున్నారని వెల్లడించింది. ఇక, సెబీలో నియామకంతో ఆమె 2017లో స్థాపించిన కంపెనీలు నిద్రాణమైపోయాయని పేర్కొంది.

అయితే.. వాటి బాధ్యతలను 2019లో ఆమె భర్త స్వీకరించారని.. ఆ కంపెనీ ఇప్పటికీ మాధబి సొంత కంపెనీగానే ఉందని.. కన్సల్టెంగ్ రెవెన్యూ అది సంపాదిస్తోందని హిండెన్ బర్గ్ తెలిపింది. దీంతో... మరోసారి ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

కాగా... సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి బచ్ పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్ లలో ఆమెకు, ఆమె భర్తకూ వాటాలు ఉన్నాయని ఆరోపించీంది. అసలు.. అదానీకి చెందిన సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యపరిచిందని పేర్కొంది!

Tags:    

Similar News