హిస్టరీ రిపీట్ కాదు... సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు!
ఈ నెల 25న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లోనూ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.
ఈ నెల 25న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లోనూ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరినీ పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టోను తయారు చేసింది. ఈ క్రమంలో హిస్టరీ రిపీట్ కాదని.. కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు సచిన్ పైలట్!
అవును... రాజస్థాన్ లో ఈ సారి హిస్టరీ క్రియేట్ చేస్తామని చెబుతున్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్. గత 30 ఏళ్లుగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఏ పార్టీకూడా గెలవలేదు. అయితే అలా ఎందుకు గెలవలేకపోతున్నామో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పైలట్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని బ్రేక్ చేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా... రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన సచిన్ పైలట్... సామాజిక సంక్షేమం, పెట్టుబడులు, సంపద సృష్టిపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. అంతిమంగా... అసమాతనలు లేని రాజస్థాన్ కావాలని పైలట్ కోరుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీలో ఉన్న ఇంటర్నల్ సమస్యలపైనా స్పందించారు.
ఇందులో భాగంగా... రాష్ట్ర అగ్ర నాయకత్వం మధ్య విభేదాలపై స్పందించిన సచిన్... తాము సమిష్టిగా ఎన్నికల్లో పోరాడతామని.. మెరుగైన ఫలితాలు సాధిస్తామని.. పదవులు ఎంపిక సంగతి హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సలహా మేరకు "క్షమించండి, మరచిపోయి ముందుకు సాగండి" మంత్రాన్ని అనుసరిస్తున్నట్లు పైలట్ తెలిపారు.
కాగా... గత 30 సంవత్సరాలుగా రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య హోరీ హోరీ పోరు ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో... ఒకసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. నెక్స్ట్ టైం కాంగ్రెస్ పైచేయి సాధిస్తుంది. అయితే ఈసారి అలా జరగదని... ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని అంటున్నారు పైలట్.
1993 నుంచి జరిగిన ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే... 1993లో బీజీపీ గెలవగా.. 1998లో కాంగ్రెస్ కుర్చీ ఎక్కింది. తర్వాత 2003లో బీజేపీ గెలవగా.. 2008లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే క్రమంలో 2013లో బీజేపీ అధికారంలోకి రాగా... 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో... 2023లో హిస్టరీ రిపీట్ కాదని, కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని.. సచిన్ పైలట్ ధీమాగా చెబుతున్నారు!