పక్షులా.. డ్రోన్ కెమెరాలా..! హైదరాబాద్‌లో ఇలాంటి సీన్ ఎప్పడు చూసి ఉండరు!

హైదరాబాద్ మహానగరంలో గణేశుడి నిమజ్జనోత్సవం కనులపండువగా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వినాయకుల సందడి కనిపిస్తోంది.

Update: 2024-09-17 07:52 GMT

హైదరాబాద్ మహానగరంలో గణేశుడి నిమజ్జనోత్సవం కనులపండువగా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వినాయకుల సందడి కనిపిస్తోంది. 11 రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడి చేరేందుకు పయనమయ్యాడు. దాంతో ట్యాంక్‌బండ్ సైడ్ వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ముఖ్యంగా సచివాలయం ప్రాంతం.. ట్యాంక్‌బండ్‌పై ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు.

11 రోజుల పూజల తరువాత ఖైతరాబాద్ వినాయకుడిని నిమజ్జనానికి నిర్వాహకులు తరలించారు. దాంతో ఇప్పటికే గణపయ్య ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. మరికొద్ది నిమిషాల్లోనే నిమజ్జనం పూర్తికానుంది. అయితే.. హైదరాబాద్ నగరం మొత్తం తరలివచ్చిందా అన్న చందంగా ట్యాంక్‌బండ్, దాని పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఎటుచూసినా జనంతో నిండిపోయి ఉంది. మరోవైపు మీడియా సైతం ఈ కవరేజీని ఇచ్చేందుకు నానా సర్కస్‌లు చేస్తోంది.

ఇదే క్రమంలో ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఇంతటి మహాఘట్టం సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసేందుకు పోలీసులకు పెద్ద టాస్క్‌లా మారింది. అందులోనూ ఈ రోజు నగరంలో సెప్టెంబర్ 17 వేడుకలు సైతం నిర్వహిస్తున్నారు. అటు వేడుకలు, ఇటు నిమజ్జనోత్సవం కోసం పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దాదాపు 25వేలకు పైగా పోలీసులు బందోబస్తులో ఉండిపోయారు. ఒకవిధంగా డేగ కన్నుతో బందోబస్తును పరిశీలిస్తున్నారు.

ఇందులోభాగంగానే పెద్ద సంఖ్యలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఆకాశంలో వాటిని చూసిన ప్రజలు పక్షులు తిరుగుతన్నట్లు భావించారు. కానీ.. నిశితంగా పరిశీలిస్తే కానీ తెలియలేదు అవి డ్రోన్ కెమెరాలని. పదుల సంఖ్యలో ట్యాంక్‌బండ్ పరిసరాల్లోనే తిరుగుతుండడంతో ఒకింత ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. వాటిని ఫొటోలు, వీడియోల ద్వారా తమ సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. ప్రస్తుతం వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News