హైదరాబాద్ పోలీసులకు ఏమైంది? సీఎం రేవంత్ కు ట్రాఫిక్ కష్టాలు

ఆ తర్వాత కూడా కాన్వాయ్ వాహనాల్ని ఆయన వాడింది. లేదు. తొలిసారి శనివారం ఆయన కాన్వాయ్ వాహనాల్ని వినియోగించారు. ఆయన కాన్వాయ్ లోని కార్లకు 0009 నెంబరును కేటాయించారు.

Update: 2023-12-10 05:57 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కొత్త వాహనాలకు నెంబర్లు కేటాయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి కొత్త కాన్వాయ్ లో ప్రయాణించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడి.. ముఖ్యమంత్రిగా రేవంత్ ఎంపిక పూర్తై.. బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చే నాటికే ఆయన కాన్వాయ్ ను ఏర్పాటు చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే ముందు రోజు రాత్రి వేళకు పోలీసు అధికారులు ఆయనకు కొత్త కాన్వాయ్ను ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ.. రేవంత్ మాత్రం కాన్వాయ్ వాహనాల్లో ప్రయాణించేందుకు ఇష్టపడలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండానే కాన్వాయ్ వాహనాల్లో ఎక్కనని స్పష్టం చేసి.. తన సొంత వాహనంలో వెళ్లిపోయారు. అయినప్పటికీ భద్రతా కారణాలతో రేవంత్ వాహనాన్ని కాన్వాయ్ వాహనాలు అనుసరించాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున.. ప్రమాణస్వీకారం చేసేందుకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాన్నే ఎంచుకున్నారు. కియా కంపెనీకి చెందిన కారులో సోనియాగాంధీ.. రాహుల్.. ప్రియాంకలతో పాటు రేవంత్ కలిసి హోటల్ తాజ్ నుంచి ఎల్ బీ స్టేడియంకు రావటం తెలిసిందే.

ఆ తర్వాత కూడా కాన్వాయ్ వాహనాల్ని ఆయన వాడింది. లేదు. తొలిసారి శనివారం ఆయన కాన్వాయ్ వాహనాల్ని వినియోగించారు. ఆయన కాన్వాయ్ లోని కార్లకు 0009 నెంబరును కేటాయించారు. అయితే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన సీఎంకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కారణంగా ఆయన వాహనాలు చిక్కుకుపోయాయి. నిజానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గడిచిన కొద్ది రోజులుగా వరుసగా ఫెయిల్ అవుతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజున ట్రాఫిక్ ఎంత భారీగా నిలిచిపోయిందో తెలిసిందే. ఎప్పుడూ లేని విధంగా సీఎం ప్రయాణించే కాన్వాయ్ వాహనాలు సైతం ట్రాఫిక్ లో చిక్కుకుపోవటంలో బాధ్యులు ఎవరన్న విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా ఫోకస్ చేయాలన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News