తాజాగా హైడ్రా బుల్డోజర్ అమీన్ పూర్ కు మళ్లింది

సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు వీలుగా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు.

Update: 2024-09-03 12:19 GMT

అక్రమ నిర్మాణాలు.. చెరువులు.. ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు.. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై హైడ్రా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూల్చివేతల్ని చేపట్టిన హైడ్రా.. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల్ని కూల్చేసింది. సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు వీలుగా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని ఐలాపూర్ తండాలోని సర్వే నెంబరు 119లో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాట్లు వేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా.. రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ప్రాధమిక విచారణ చేపట్టారు. అనంతరం ఈ రెండు శాఖల అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమ కట్టడాలు.. సరిహద్దు రాళ్లను తొలగించారు.

దీనికి దగ్గర్లోని సర్వే నెంబరు 462లోని ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలోని నిర్మాణాల్ని కూల్చివేశారు. ప్రభుత్వానికి చెందిన 15 గుంటల భూమిని అక్రమించి గదులు.. ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో.. తాజాగా వీటిని కూల్చేశారు. మరోవైపు హైదరాబాద్ తోపాటు.. చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజి గిరి, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాల పరిధిలోని 3500 చెరువులను రంగనాధ్ కు అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News