భర్త ఐఏఎఫ్, భార్య ఆర్మీ... వేరు వేరు ప్రాంతాల్లో ఒకేరోజు ఆత్మహత్య!
వివరాళ్లోకి వెళ్తే... దీన్ దయాళ్ దీప్ (32) ఆగ్రాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పని చేస్తున్నారు.
భర్త ఐఏఎఫ్.. భార్య ఆర్మీ.. అన్నుకోని రీతిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకేరోజు వేరు వేరు ప్రాంతల్లో వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పనికి ఒడిగట్టారని తెలుస్తోంది. ఇలా వేరు వేరు నగరాల్లో ఒకేరోజు భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
అవును... ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పని చేస్తున్న దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అటు ఐఏఎఫ్, ఇటు ఆర్మీల్లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేరు వేరు నగరాల్లో ఒకే రోజు దాదాపు ఒకే సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఇప్పుడు వైరల్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... దీన్ దయాళ్ దీప్ (32) ఆగ్రాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పని చేస్తున్నారు. అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో అతడి భార్య రేణు తన్వర్ ఆర్మీ కెప్టెన్ గా ఉన్నారు. ఈ క్రమంలో... ఆమె తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లారు.
ఈ క్రమంలో రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్... మరుసటి రోజు బయటకు రాకపోవడంతో కొలీగ్స్ తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భోజన సమయంలో దీప్ తమతో సరదాగానే మాట్లాడారని.. ఉదయం చూసే సరికి విగతజీవిగా కనిపించారని.. ఇంతలో ఏమి జరిగిందో తెలియదని కొలీగ్స్ చెబుతున్నారు.
అయితే అదే రోజు తన తల్లి, సొదరుడితో కలిసి ఢిల్లీకి వెళ్లిన అతడి భార్య రేణు తన్వర్ కూడా ఢిల్లీ కంటోన్మెంట్ లోని అధికారుల మెస్ హాల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో.. అక్కడున్న సిబ్బంది సమాచారం అందిచడంతో అక్కడకు చేరుకున్న పోలీసులకు సూసైడ్ నోట్ కనిపించింది.
అందులో... తన భర్త మృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు చేయాలని ఆమె కోరారు. అయితే... దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. తన భర్త కూడా ఆత్మహత్య చేసుకుంటారని ఈమెకు ముందే తెలుసా.. అందుకే ఆయనతో కలిపి దహన సంస్కారాలు చేయాలని కోరారా అనే పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఏది ఏమైనా... ఇలా ఒకే రోజు భార్య భార్యభర్తలిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడటం చర్చనీయాంశం అయ్యింది. ఈ మరణాలపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.