పో*ర్న్ వీడియోలు తయారు చేయడంలో భారత్ 8వ స్థానం!

ప్రస్తుతం విడుదలైన జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉండటం కచ్చితంగా అత్యంత ఆదోళనకరమైన విషయంగానే భావించాలి.

Update: 2024-08-20 04:05 GMT

నేటి ప్రపంచంలో యువత తప్పుదారి పట్టడానికి గల ప్రధానకారణాల్లో ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్ కంటే ప్రమాదకరమైన మరో కారణం ఉందని అంటున్నారు పరిశీలకులు.. అదే పో*ర్న్! పైగా... ఈ అశ్లీల వ్యాపారం ఆర్థికంగా తీవ్ర లాభదాయకంగా ఉందని కొందరు భావిస్తుండటంతో దీని వ్యాప్తి ఘణనీయంగా విస్తరించబడుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో భారత్ కు ఏమీ తక్కువ కాదన్నట్లుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి!

అవును... కొంతమంది అశ్లీల వ్యాపారాన్ని అత్యంత లాభదాయకమైందిగా చూడటంతో పో*ర్న్ విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. ఇక ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిందో.. చాలా రంగాల్లాగానే ఇది కూడా హద్దులు లేకుండా పోతుంది. ఇలా అరచేతిలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ పో*ర్న్ చూసే పరిస్థితి అందుబాటులోకి రావడంతో విచ్చలవిడి తనం పెరిగిపోతుందని చెబుతున్నారు.

ఇక సినిమాల్లోనూ, వెబ్ సిరీసుల్లోనూ బూతుకీ, శృంగారానికీ మధ్య ఉన్న సున్నితమైన గీత చెరిగిపోతున్న దశ పూర్తిగా చెరిగిపోయినట్లు కనిపిస్తుండటంతో నెక్స్ట్ స్టెప్ పో*ర్న్ అనే ఆలోచన యువతలో ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ఉదాహరణకు.. బాలీవుడు నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇటీవల పోర్న్ సంబంధిత వ్యాపారాన్ని నడుపుతున్నారనే ఆరోపణలపై విచారణకు గురైన సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో చాలా దేశాల్లో ఈ ఇండస్ట్రీ వెనుక బడా వ్యాపారవేత్తలు ఉన్నారని.. ఈ రంగం ఇంత గణనీయంగా వ్యాప్తి చెందడానికి అదే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ ఇండస్ట్రీ ఎంతలా విస్తరించిందనే విషయం ఒక్కమాటలో చెప్పాలంటే.. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో కంటే ఈ పో*ర్నోగ్రఫీ సైట్లలో ఎక్కువ స్ట్రీమింగ్ జరుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి.

వాస్తవానిక్ ఓ వైపు భారత్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు.. పోర్న్ సైట్లను ఎప్పటికప్పుడు కట్టడిచేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వీలైనంత మేరకు చాలా వెబ్ సైట్లు భారత్ లో దర్శనమివ్వకుండా అరికట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే అనూహ్యంగా భారత్ వంటి దేశాల్లో కూడా పో*ర్నోగ్రఫీ పెరుగుతుంది. అది వీక్షించడంలోనే కాదు సుమా.. పో*ర్నోగ్రఫీ కంటెంట్ రెడీ అవుతున్న విషయంలో కూడా. ఇప్పుడు ఇది షాకింగ్ విషయంగా మారింది.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో అశ్లీల చిత్రాలను ఉత్పత్తి చేసే దేశాల మార్కెట్ వాటాను పరిశీలిస్తే అక్కడ భారత్ స్థానం టాప్ -10లో ఉండటం ఆందోళనకరమైన విషయంగానే భావించాలి. అన్ని విషయాల్లోనూ అగ్రస్థానంలో ఉండేందుకు ప్రయత్నించి, పలు విషయాలో సక్సెస్ అయిన అగ్రరాజ్యం అమెరికా ఈ విషయంలోనూ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. నెక్స్ట్ యునైటెడ్ కింగ్ డమ్ ఉంది.

సంస్కృతీ సాంప్రదాయాలకు పుట్టినిల్లని చెప్పుకునే భారత్ లో ఇంతలా ఈ కంటెంట్ రెడీ అవుతుందంటే చాలా ఆశ్చర్యమే కాదు షాకింగ్ అనే చెప్పాలి. దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించి అరికట్టని పక్షంలో రాబోయే రోజుల్లో యంగ్ జనరేషన్ దీనికి పూర్తిగా అలవాటు పడి చదువులు పాడై, సంప్రదాయాలు, విలువలు మట్టికలిసిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇదే సమయంలో అత్యాచారలూ పెరిగిపోయే ప్రమాదం ఉందనీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం విడుదలైన జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉండటం కచ్చితంగా అత్యంత ఆదోళనకరమైన విషయంగానే భావించాలి. భారత్ కంటే ఇటలీ, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాలో ఈ పో*ర్నోగ్రఫీని ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నాయని భావించవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అశ్లీల కంటెంట్ ను కంట్రోల్ చేయడానికి కొంతవరకూ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇది ఏమాత్రం సరిపోవడం లేదని తాజా ఘణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.

అశ్లీల చిత్రాలను ఉత్పత్తి చేసే దేశాల మార్కెట్ వాటా ఈ విధంగా ఉంది!:

1. యునైటెడ్ స్టేట్స్ (24.52%)

2. యునైటెడ్ కింగ్ డమ్ (5.49)

3. జర్మనీ (4.90%)

4. బ్రెజిల్ (4.80%)

5. ఫ్రాన్స్ (4.01%)

6. రష్యా (4.01%)

7. కెనడా (3.19%)

8. భారత్ (3.18%)

9. ఇటలీ (2.64%)

10. స్పెయిన్ (2.46%)

Tags:    

Similar News