భారత్ గా ఇండియా... క్రెడిట్ పవన్ దే...?

కానీ ఇప్పటికి అయిదేళ్ళ క్రితం ఏపీకి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతదేశం అన్నదే అసలు పేరు అంటూ గట్టిగానే చెప్పారు.

Update: 2023-09-06 14:32 GMT

భారతదేశంగా ఇండియా పేరుని మార్చాలని బీజేపీ డిసైడ్ అయిందని అంటున్నారు. ఆ దిశగా చురుకుగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని అంటున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ అయిదు రోజుల పాటు ఆదివారాలు సెలవు కూడా లేకుండా నిర్వహించే పార్లమెంట్ స్పెషల్ సెషన్ లో బిల్లు పెట్టి మరీ భారత్ గా పేరు మార్పు చేస్తారు అని అంటున్నారు.

నిజానికి ఇండియా దట్ ఈజ్ భారత్ అని పేరు రాజ్యంగంలో ఉండనే ఉంది. ఇక భారతదేశం పేరు మార్పు వల్ల బీజేపీ రాజకీయంగా లబ్ది పొందడానికి ఇదంతా చేస్తోంది అని విపక్షాలు అంటున్నాయి. భారత్ వర్సెస్ ఇండియా అన్న పేర్లలో భారత్ కి ఓటేసేవారూ ఉన్నారు. ఇండియా అయితేనేంటి అన్న వారు ఉన్నారు.

అయితే మెజారిటీ ప్రజల సెంటిమెంట్ ని ఎమోషన్స్ ని పట్టుకుని భారత్ పేరు మార్పుతో రేపటి రాజకీయాన్ని అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో భారత్ పేరును మార్చాలని పార్లమెంట్ బయటా లోపలా డిమాండ్ చేసినది ఎక్కువ మంది బీజేపీ వారే. అలాగే దాని అనుబంధ సంస్థలకు చెందిన వారే.

కానీ ఇప్పటికి అయిదేళ్ళ క్రితం ఏపీకి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతదేశం అన్నదే అసలు పేరు అంటూ గట్టిగానే చెప్పారు. ఆయన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇండియా అన్నది పరాయి పాలకులు బ్రిటిష్ వారు పెట్టిన పేరు అన్నారు. భారతదేశమే అసలైన పేరు అని నాటి సభలో చెప్పారు.

భారతదేశం గర్వం గౌరవం అంటూ ఆయన చాలానే మాట్లాడారు. ఇపుడు భారత్ అని కేంద్రం పేరు మార్పు చేయలని నిర్ణయించింది అని ప్రచారం సాగుతున్న వేళ నాడు సైరా సినిమా ఫంక్షన్ లో పవన్ ఇచ్చిన స్పీచ్ ని జనసైనికులు ముందు పెట్టి వైరల్ చేస్తున్నారు. దేశ భక్తి విషయంలో పవన్ అందరి కంటే ముందున్నారని వారు అంటున్నారు.

జాతీయ భావాలు స్వదేశీయ అభిమానం అన్న భావజాలంతో పవన్ ఎపుడూ అగ్రభాగాన ఉంటారని కూడా అంటున్నారు. నాడు పవన్ అన్న మాటలే ఇపుడు నేడు భారత్ పేరుని సమర్ధించేవారు అంతా అంటున్నారు అని గుర్తు చేస్తున్నారు. పవన్ అలా పిలుపు ఇచ్చారు. ఇపుడు బీజేపీ పెద్దలు అలా చేస్తున్నారు అని కూడా అంటున్నారు.

నిజానికి చూస్తే భారత్ పేరు మార్పు మీద వైసీపీ పాజిటివ్ గానే స్పందించింది. పేరు మారిస్తే మంచిదే అని చెప్పుకొచ్చింది. ఇక జనసేన విషయంలో చూస్తే 2019 నాటికి పవన్ జనసేన బీజేపీకి మిత్రుడిగా లేదు. 2020లో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఇపుడు ఆయన ఎన్డీయేకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మిత్రుడు. జమిలి ఎన్నికల నుంచి బీజేపీ ఏమి చేసినా జనసేన మద్దతుగా నిలుస్తోంది.

అయితే ఎంపీలు ఎవరూ ఆ పార్టీకి లేకపోవడం వల్ల అది కేవలం నైతిక మద్దతుగా ఉంటోంది. ఇపుడు భారత్ విషయంలో కూడా జనసేన మద్దతు ఇస్తోంది. ఇక బీజేపీ కంటే నాలుగు అడుగులు ముందే పవన్ ఈ డిమాండ్ చేశారని చెప్పుకోవడం ద్వారా అసలైన దేశ భక్తుడు పవన్ అంటున్నారు. రేపటి రోజున బీజేపీ భారత్ పేరు మార్పుని చేసినా అందులో ఏపీ వరకూ జనసేన క్రెడిట్ తీసుకునేలా ఉంది. దానికి సైరా ఫంక్షన్ లో పవన్ మాట్లాడిన వీడియోవే సాక్ష్యం. సో పవన్ నాడు చెప్పినదే బీజేపీ నేడు అమలు చేస్తోంది అన్న మాట.

Tags:    

Similar News