ఐఫోన్ ఆర్డర్ చేసి.. ఇంటికొచ్చిన డెలివరీ ఏజెంట్ ని చంపేశారు!
అవును.. డెలివరీ ఏజెంట్ (30).. ఐఫోన్ డెలివరీ చేయడానికి వెళ్లి రూ.1.5 లక్షలు చెల్లించాల్సిన ఇద్దరు వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు.
ఐఫోన్ కి ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫోన్ ల కోసం దొంగతనాలు చేసేవాళ్లు, ఇంట్లో వాళ్లను బ్లాక్ మెయిల్ చేసేవారు కూడా ఉన్నారని అంటారు. ఈ సమయంలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ తో ఐఫోన్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. ఆ ఆర్డర్ తెచ్చిన డెలివరీ ఏజెంట్ ని చంపిన ఘటన తెరపైకి వచ్చింది.
అవును.. డెలివరీ ఏజెంట్ (30).. ఐఫోన్ డెలివరీ చేయడానికి వెళ్లి రూ.1.5 లక్షలు చెల్లించాల్సిన ఇద్దరు వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. అతడిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఇందిరా కెనాల్ లో పడేశారని చెబుతున్నారు. ఆ మృతదేహం కనుకొనడానికి ఎస్.డీ.ఆర్.ఎఫ్. బృందాలను పిలిచినట్లు వెల్లడించారు.
వివరాళ్లోకి వెళ్తే.. లక్నోలోని చిన్ హట్ కు చెందిన గజానన్ అనే వ్యక్తి ఫ్లిప్ కార్ట్ నుంచి రూ.1.5 లక్షల విలువైన ఐ ఫోన్ ను ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ను ఎంచుకున్నారు. దీంతో... సెప్టెంబర్ 23న నిషాత్గంజ్ కు చెందిన డెలివరీ బాయ్ భరత్ సాహూ... ఫోన్ డెలివరీ చేయడానికి వెళ్లాడు.
ఈ సమయంలో... ఐఫోన్ ఆర్డర్ చేసిన గజానన్, అతని సహచరుడు కలిసి డెలివరీ బాయ్ ను గొంతునులిమి చంపి అతని వద్ద నుంచి ఐఫోను తీసుకున్నారు! అనంతరం అతడి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇందిరా కెనాల్ లో పడేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ తెలిపారు.
అయితే... భరత్ సాహూ రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబం సెప్టెంబరు 25న చిన్ హట్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసింది. ఈ సమయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాహు కాల్ వివరాలను.. అతడు ప్రయాణించిన చివరి లొకేషన్ ను కనుగునే ప్రయత్నంలో... గజానన్ నెంబర్ ను కనుగొన్నారు.
అతని షేహితుడు ఆకాష్ నూ చేరుకోగలిగారు. ఈ సమయంలో... విచారణలో ఆకాష్ నేరం అంగీకరించినట్లు డీసీపీ శశాంక్ తె లిపారు. అయితే సాహూ మృతదేహాన్ని ఇంకా కనుగొనలేదని అన్నారు. దాన్ని కనుగొనడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్.డీ.ఆర్.ఎఫ్.) బృందాన్ని పిలిచినట్లు తెలిపారు.