జగన్ కమిట్మెంట్ కే క్వశ్చన్ మార్క్ పడేలా ?

ఆయన విపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక హక్కుగానే తీసుకుంటున్నారు.

Update: 2024-09-09 03:00 GMT

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కి ప్రజల మీద ఉన్న కన్సర్న్ ఏంటి, ఆయన కమిట్మెంట్ ఏంటి అన్నది అధికార టీడీపీ కూటమి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తోంది. జగన్ చేసే ప్రతీ విమర్శను రాజకీయ కోణంలోనే చూస్తోంది. ఆయన విపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక హక్కుగానే తీసుకుంటున్నారు.

అయితే దానిని అధికారం పోయింది అన్న ఆక్రోశంతో ఆయన చేస్తున్న విమర్శలుగానే కూటమి పెద్దలు చాటి చెబుతున్నారు. అంతే కాదు తనను ఓడించిన ప్రజల మీద జగన్ కి వైసీపీకి అక్కసు ఉందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో చూస్తే జగన్ అండ్ కో కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండాల్సిన సమయం ఇది.

ఎందుకంటే ఒక కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల పాటు సమయం ఇవ్వాలి. ఇంతలో ప్రభుత్వం అన్నీ సర్దుకుంటుంది. కుదురుకుంటుంది. ప్రజలకు కూడా కొత్త ప్రభుత్వం మీద ఆశలు ఆకాంక్షలు చాలా ఉంటాయి. వారు కూడా ప్రభుత్వం ఏదో చేస్తుందని చూస్తూంటారు. అలాగే ప్రజలు కూడా ప్రభుత్వానికి కొంత టైం ఇస్తారు. తాము కోరిన కోరికలు కానీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ తీర్చేందుకు కొంత సమయం పడుతుందని కూడా అనుకుంటారు.

మెల్లగా ఒక్కోటిగా ప్రభుత్వం చేసి పెడుతుందని కూడా వేచి చూస్తారు. కనుక ఆ సమయంలో విపక్షాలు చేసే విమర్శలు ప్రజల చెవికి ఏ మాత్రం ఎక్కవు. దాంతో కూడా విపక్షం సైలెంట్ గా ఉంటేనే బెటర్ అన్నది ఒక రాజకీయ నీతిగా అమలవుతూ వస్తోంది.

కానీ ఏపీలో చూస్తే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీని జగన్ కూటమి టార్గెట్ చేయడంతో నోరు విప్పక తప్పింది కాదు, అలాగే వైసీపీ క్యాడర్ మీద కూడా దాడులు జరిగాయి. ఆ విధంగా జనంలోకి జగన్ రావాల్సి వచ్చింది.

మరో వైపు చూస్తే వరస ప్రమాదాలు ప్రకృతి విపత్తులు ఏపీని అల్లల్లాడిస్తున్నాయి. దాంతో వైసీపీ అధినేత రంగంలోకి దిగడం పరామర్శలు చేయడం తప్పనిసరి అవుతోంది. అది విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన భారీ ప్రమాదం అయి 19 మంది మరణించిన ఘటనా అయినా లేక బెజవాడ వరదలు అయినా టోటల్ గా ఏపీలో వరదల వల్ల 45 మంది జనాలు మరణించడం అయినా విపక్షం నోరు విప్పి రియాక్ట్ కావాల్సిన ఇష్యూలే.

దాంతో వైసీపీ స్పందించాల్సి వస్తోంది. అయితే అదే సమయనంలో వైసీపీ కేవలం విమర్శలు చేయడమేనా బాధ్యత లేదా అన్న చర్చను కూటమి ప్రభుత్వం తెర మీదకు తెస్తోంది. మాకు పని చాలా ఉంది అందుకే ఇక్కడ ఉంటున్నాం, జగన్ కి పని లేదు కాబట్టే లండన్ టూర్ కి పోతున్నారు అని కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మీడియాతో అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇపుడు చూస్తే లోకేష్ కూడా అదే కౌంటర్ వేశారు. పాస్ పోర్ట్ సమస్యతోనే జగన్ కనీసం బెంగళూరులో అయినా ఉంటున్నారని పాస్ పోర్ట్ ఇష్యూ లేకపోతే ఈపాటికి ఆయన లండన్ కి ఎగిరిపోయేవారు అని కూడా అంటున్నారు. మరో వైపు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ లో జగన్ కేరాఫ్ లండన్ అని విమర్శలు చేస్తోంది.

లండన్ లోనే జగన్ ఏనాటికి అయినా స్థిరపడరారు అని ఆయనకు మా రాష్ట్రంతో ప్రజలతో సమస్యలతో సంబంధం ఏమిటి అని కూడా ప్రశ్నిస్తోంది. మరి జగన్ కానీ వైసీపీ కానీ కేవలం విమర్శలతోనే సరిపెడుతున్నారా లేక జనంలోకి వెళ్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది.

విమర్శలు చేయవచ్చు కానీ దానితో పాటుగా పని కూడా చెస్తే ఈ విమర్శలకు విలువ ఉంటుందని అంటున్నారు. వైసీపీలో ఎంతో మంది నేతలు ఉన్నా భారీ విపత్తు వేళ వారంతా ఎక్కడ ఉంటున్నారు అన్న చర్చ కూడా వస్తోంది. దాంతో పాటు జగన్ బెంగళూరులో ఉంటున్నారు అన్నది టీడీపీ ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా ఆయన కమిట్ మెంట్ కి కన్సర్న్ కి ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు.

టీడీపీ వారు అంటున్నట్లుగా జగన్ పాస్ పోర్టు సమస్యతో లండన్ వెళ్లలేకపోతే కనీసం ఏపీలో ఉండి అయినా పార్టీ వారికి దిశా నిర్దేశం చేసి వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యలలో ఎక్కువగా పాల్గొనేలా చేస్తే బాగుండేది అని అంటున్నారు. ఏది ఏమైనా కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు పూర్తి ఇబ్బందిలోకి నెడతాయి.

నిజానికి జగన్ లండన్ అయితే వెళ్లలేదు. కానీ ఆయన లండన్ టూర్ కి సీబీఐ అనుమతి ఇవ్వడం ఆయన పాస్ పోర్టు వ్యవహారం ఇవన్నీ కూడా మీడియాలో నలిగాయి. ఈ కీలక సమయంలో తాను ఏపీలోనే ఉంటున్నాను ప్రజల కోసమని వైసీపీ అధినాయకత్వం చెప్పి అయినా తమ కమిట్ మెంట్ ని చాటాలని అంటున్నారు. ఆ విధంగానే టీడీపీ కూటమికి సరైన కౌంటర్ ఇవ్వగలుగుతారు అని అంటున్నారు.

Tags:    

Similar News