జగన్ కి ప్రమాదం పొంచి ఉందా ?

జగన్ చాలా ప్రమాదంలో ఉన్నారు అని సంచలన వ్యాఖ్యలే చేశారు. జగన్ ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది అని కూడా అన్నారు.

Update: 2024-05-27 16:57 GMT

ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తామని ముహూర్తం సైతం పెట్టుకుని ఫుల్ జోష్ లో వైసీపీ ఉంటే ఒక పెద్దాయన మాత్రం జగన్ కి ప్రమాదం జరగబోతోంది అని జోస్యం కాని జోస్యాన్ని వదిలారు. ఆయన సీరియస్ గానే ఈ మాట అన్నారు అని చెప్పడానికి కంటతడి సాక్ష్యం.

ఇంతకీ ఆయన ఎవరూ అంటే ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరో మాటలో చెప్పాలీ అంటే జగన్ కి నమ్మిన బంటు. ఆయన తాజాగా లండన్ టూర్ లో అక్కడ ఎన్నారైలతో జరిగిన మీటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు.

జగన్ చాలా ప్రమాదంలో ఉన్నారు అని సంచలన వ్యాఖ్యలే చేశారు. జగన్ ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది అని కూడా అన్నారు. అంతటితో ఆగకుండా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇండియా నుంచి వచ్చి వైసీపీ గురించి జగన్ గురించి మంచి మాటలు చెబుతారని ఊహించిన ఎన్నారైలకు వైసీపీ ఫ్యాన్స్ కి సదరు పెద్దాయన ఫుల్ గా టెన్షన్ పెట్టేశారు అని అంటున్నారు.

జగన్ సీఎం అవుతున్నాడని అంతా ప్రచారం సాగుతున్న వేళ ఆయనకు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమిటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. పొన్నవోలు మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో వైపు చూస్తే జగన్ ఎవరి మాటా వినే రకం కాదని ఏది జరిగితే జరగనీ అనుకునే వారు అని పొన్నవోలు అంటున్నారు.

మరి జగన్ కి ప్రమాదం అంటే ఆయనకు కీడు తలపెట్టడమేనా అలా ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జగన్ అయితే కర్మ సిద్ధాంతానే నమ్ముతారు అని ఆయన సభలలో మాట్లాడిన మాటలు చూసినా లేక ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూలు చూసినా అర్ధం అవుతుంది. దేవుడు ఉన్నాడు చూసుకుంటారు అని జగన్ వేదాంత ధోరణిలో అంటూ ఉంటారు.

అయితే జగన్ మీద విజయవాడలో రాయి దాడి కొద్ది నెలల క్రితం ఎన్నికల ప్రచారం వేళ జరిగింది. అది ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చేందుకే అని వైసీపీ శ్రేణులు కూడా ఆరోపించాయి. అయితే జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు.

ఇక పొన్నవోలు మాటల బట్టి చూస్తే జగన్ కి సీఎం అయినా కూడా ప్రమాదం పొంచి ఉందా అన్నదే చర్చ. జగన్ సీఎం అయినా లేక ఓటమి పాలు అయినా ప్రమాదం అయితే ఆయనను వెంటాడుతుందని అన్నది క్లుప్తంగా పొన్నవోలు చెప్పిన దానిని బట్టి విశ్లేషించుకోవచ్చు అని అంటున్నారు.

జగన్ కి రాజకీయంగా ప్రత్యర్ధులు లేరు శత్రువులే ఉన్నారు అన్నది చాలా మంది మాట. అంతా నమ్మే మాట కూడా. అందుకేనా పొన్నవోలు ఆయన విషయంలో భయపడుతోంది అన్న టాక్ కూడా నడుస్తోంది. ఏపీ పాలిటిక్స్ లో ప్రతీకారం అన్నది పీక్స్ కి చేరిపోయింది.

ఎవరు ఈ వికృత క్రీడను మొదట ప్రారంభించారు అన్నది పక్కన పెడితే ఇపుడు చాన్స్ ఎవరిదైతే వారు తమ గేమ్ ఆడుతూనే ఉంటారు తప్ప ఎక్కడా తగ్గరు ఆగరు అన్నది కూడా అర్ధం అవుతున్న విషయం. వర్గ పోరాటం అన్నది ఏపీలో లేదు, కానీ అది అండర్ కరెంట్ గా ఉంది అని అంటున్నారు.

పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ జగన్ వర్గ పోరాటానికి ఎన్నికల వేళ తెర తీశారు. మరి పెత్తందారులు అంటే పేదలకేనా పేదల పక్షం అంటున్న జగన్ కూనా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా జగన్ కి మాత్రం ప్రమాదం ఉందనే పొన్నవోలు వేదన వాదన. మరి ఆయన ఆ ఒక్క ముక్క చెప్పి ఊరుకున్నారు. ఎలా ఎందుకు ఎవరి వల్ల అన్నది మాత్రం చెప్పకుండా ఎవరి ఊహలకు వారికే వదిలేశారు

దాంతో జగన్ కి ప్రమాదం రాజకీయ శత్రువుల నుంచే అన్నది అర్ధమవుతోంది అంటున్నారు. సో ఏపీలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చినా పాలిటిక్స్ ఆగదని, దాని మాటున డర్టీ గేమ్స్ కూడా ఆగవని మెల్లగా బోధపడుతున్న విషయం. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News