జగన్ లో తగ్గిన జోష్.. ఇందుకు అసలు కారణం అదేనా?

అయినా ఇంకా ఆయనలో మునుపుటి దూకుడు మాత్రం ఇంకా కనిపించలేదు. ఈ నేపథ్యంలో జగన్ కేసుల విషయంలో భయపడుతున్నారని

Update: 2024-10-07 07:07 GMT

నాలుగు నెలల మౌనం తర్వాత జగన్ తిరిగి మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఓటమి షాక్ నుంచి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయినా ఇంకా ఆయనలో మునుపుటి దూకుడు మాత్రం ఇంకా కనిపించలేదు. ఈ నేపథ్యంలో జగన్ కేసుల విషయంలో భయపడుతున్నారని.. చంద్రబాబు అంత ఈజీగా వదలడు అని ఆలోచిస్తున్నారు అని అందరూ భావిస్తున్నారు. జరుగుతున్న పరిస్థితులను చూస్తే అదే కరెక్ట్ అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగక మానదు.

జగన్ భయపడుతున్నారా అంటే అవునని అనుకోవాలి.. ఎందుకంటే ఆయన వరుసగా నా ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు. మొన్న తిరుమల ప్రయాణం రద్దు చేసుకుంటే.. ఇప్పుడు తాజాగా పుంగనూరు ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. పుంగనూరులో ఆరేళ్ల బాలికపై జరిగిన హత్య సంచలనంగా మారింది. ఇంకా ఈ కేసు కు సంబంధించిన మిస్టరీ ఉండలేదు.. బాలిక అదృశ్యమైన మూడు రోజుల తర్వాత ఆమె శవం దొరికింది. హంతకులను కనుక్కోవడానికి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కారణంగా మీ పాప హత్య జరిగింది అన్న విషయం వెలుగులోకి వచ్చింది.

దీనిపై స్పందించిన జగన్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని.. కంట్రోల్ చేయడంలో కూటమి గోరంగా విఫలమైందని ఆరోపించారు. అక్టోబర్ 9న బాధ్యత కుటుంబాన్ని పరామర్శించడానికి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. మరి ఇంతలో ఏమైందో తెలియదు సడన్గా పుంగనూరు ప్రయాణాన్ని క్యాన్సిల్ చేశారు.

నిందితులు దొరికారు అన్న నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నట్టు పేర్కొనడం చర్చనీయాంసంగా మారింది. అయితే కేవలం ఇబ్బందులు వస్తాయి అని మాత్రమే జగన్ ఇలా వెనక్కి తగ్గుతున్నారా అని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి.. మరోపక్క పార్టీకి వినయ విధేయులుగా ఉన్నవారు పార్టీని వీడి వెళ్ళిపోతున్నాను. లేనిపోని సమస్యలు వస్తాయి కాబట్టి కాస్త దూకుడు తగ్గించుకుంటే బెటర్ అని జగన్ భావించినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News