కౌంట్ డౌన్ క్లాక్ : మరో 73 రోజులలో అంటూ వైసీపీ షాక్...!

ఈ సందర్భంగా వైసీపీ కేంద్రా కార్యాలయం వద్ద విపక్షాలకు షాక్ ఇచ్చేలా కౌంట్ డౌన్ క్లాక్ దర్శనం ఇచ్చింది. దీనిని వైసీపీ మంత్రులు కీలక నేతలు ఆవిష్కరించారు

Update: 2024-03-12 14:19 GMT

ఏపీలో ప్రచారంలో వైసీపీ కొత్త పుంతలు పోతోంది. ఆ పార్టీ ధీమా అనాలా లేక ఆత్మ విశ్వాసం అనాలా లేక విపక్షాలు గేలి చేసినట్లుగా అతి విశ్వాసం అనాలా ఏమో తెలియదు కానీ మరో 73 రోజులలో ఏపీలో సారి జగన్ సీఎం కావడం తధ్యమంటూ ఆ పార్టీ నిబ్బరంగా ప్రకటించుకుంది. వైసీపీ పుట్టి 13 ఏళ్ళు పూర్తి 14వ వార్షికోత్సవాలు జరిగాయి.

ఈ సందర్భంగా వైసీపీ కేంద్రా కార్యాలయం వద్ద విపక్షాలకు షాక్ ఇచ్చేలా కౌంట్ డౌన్ క్లాక్ దర్శనం ఇచ్చింది. దీనిని వైసీపీ మంత్రులు కీలక నేతలు ఆవిష్కరించారు. ఈ వాల్ క్లాక్ లో ఏమిటి ఉంది అంతే జగన్ అను నేను మరోసారి సీఎం గా ప్రమాణం అంటూ.

మరో 73 రోజులు అంటే మే నెల 24న జగన్ సీఎం గా ప్రమాణం చేస్తారు అన్నట్లుగా లెక్క కట్టి మరీ ఈ కౌంట్ డౌన్ క్లాక్ ని అమర్చారు. అంటే గతసారి మాదిరిగానే ఈసారి కూడా ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని భావించి ఈ కౌంట్ డౌన్ కి స్టార్ట్ చేశారు అని అంటున్నారు.

వైసీపీ ఎక్కడా తగ్గడంలేదు, మరెక్కడా భయపడడం లేదు. కూటమి కట్టినా ఎవరు ఎన్ని రకాలుగా పొత్తులు పెట్టుకుని వచ్చినా తమ విజయం అన్నది ఎపుడో ఖాయం అయిపోయింది అన్నది వైసీపీ ధీమాగా ఉంది. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఫలితాన్ని ఇస్తాయని వైసీపీ అధినాయకత్వం నమ్ముతోంది.

ఇటీవలనే జగన్ విశాఖ పర్యటన సందర్భంగా తాను మరోసారి ప్రమాణం స్వీకారం చేసే వేదిక విశాఖ అని చెప్పేశారు. అంటే వైసీపీ ఎంత దూకుడుగా ఉందో అర్ధం అవుతోంది అని అంటున్నారు. అదే విధంగా వైసీపీ ఇపుడు డేట్ కూడా ఇచ్చేసింది. అంటే ప్లేస్ డేట్ టైం అన్నీ కూడా చెప్పేసి మరోసారి సీఎం అని విపక్షాన్ని సవాల్ చేస్తోంది.

ఇక అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఏపీలో నాలుగు పెద్ద సభలను కీలక రీజియన్లలో సిద్ధం పేరుతో నిర్వహించి సత్తా చాటుకుంది. లక్షలాది మంది జనాలు ఈ సభలకు వచ్చారని వైసీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. వారంతా మరోమారు వైసీపీని కోరుకుంటున్నారు అని కూడా అంచనా కడుతోంది.

ఇక గతసారి నెగిటివ్ అప్రోచ్ తో జనాల వద్దకు వెళ్ళింది. దానికి కారణం అధికారంలో చంద్రబాబు ఉన్నారు. అందుకే అప్పట్లో వైసీపీ ఏర్పాటు చేసిన కౌంట్ డౌన్ క్లాక్ లో బై బై బాబు అని స్లోగన్ ఉంచారు. అది కూడా అప్పట్లో హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఏపీలో జిల్లాలలో ఏర్పాటు చేశారు. ఇపుడు వైసీపీ మరోమారు అధికారంలోకి వస్తుంది అంటూ 73 రోజులలో జగన్ అను నేను అంటూ కౌంట్ డౌన్ క్లాక్ ని ఏర్పాటు చేశారు.

రానున్న రోజులలో ఇది జిల్లాలలో ప్రతీ చోటా ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. అంటే వైసీపీ చేస్తున్న ప్రచారం ఒకసారి గమనిస్తే పాజిటివ్ వేవ్ తో ఈసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. విపక్షాన్ని పట్టించుకోవడం లేదు. మేమే వస్తున్నాం మేమే గెలుస్తున్నామని కూడా గట్టిగా చెబుతోంది. మరి వైసీపీ ఈ తరహా ప్రచారం విపక్షానికి ఏ విధంగా తగులుతుందో వారి నుంచి రియాక్షన్ ఏ విధంగా వస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News