మీడియాకు చిక్కిన జగన్ !

అవును జగన్ మీడియాకు చిక్కారు. ఆయన ఎప్పుడో అయిదేళ్ల క్రితం కంటే ముందు మీడియాతో మాట్లాడేవారు.

Update: 2024-07-20 03:33 GMT

అవును జగన్ మీడియాకు చిక్కారు. ఆయన ఎప్పుడో అయిదేళ్ల క్రితం కంటే ముందు మీడియాతో మాట్లాడేవారు. మళ్లీ ఇన్నాళ్ళకు జగన్ మీడియా ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఆయన తన ప్రసంగాన్ని సుదీర్ఘంగా కానిచ్చేస్తూ మీడియా ప్రశ్నలను దాటుకుంటూ వెళ్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ చాలా సేపు మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ మధ్యలో ఒక విలేకరి జగన్ ని ప్రశ్నలు అడిగారు. దాంతో జగన్ కాస్తా చికాకు పడ్డారు.

మధ్యలో అడ్డుకుంటే ఫ్లో పోతుందయ్యా ఏమి మాట్లాడాలో మరచిపోతాను అని జగన్ అంటూ ఎక్కడ ఆగామని బుర్ర గోక్కున్నారు. ఆ పక్కన ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ వదిలేసిన సబ్జెక్ట్ ని తిరిగి అందించడంతో కొనసాగించారు.

అయితే జగన్ కి మళ్లీ మీడియా కొత్తగానే ఉంది అని అంటున్నారు. అంతే కాదు మీడియా వారికి కూడా జగన్ తో కొత్తగానే ఉంది అని అంటున్నారు. చంద్రబాబు సహా ఇతర నాయకులు అయితే ముందు తాము చెప్పాల్సింది చెబుతారు. ఆ మీదట మీడియాను ప్రశ్నలకు ఆహ్వానిస్తారు.

జగన్ వైఖరి అయితే తాను చెప్పదలచింది చెప్పేసి వెళ్ళిపోతారు అని గతంలో అనుకునేవారు. ఇపుడు అయితే ఆయన మీడియాకు చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. వారి ప్రశ్నలను ఫేస్ చేయాలని వారు అడిగే వాటికి జవాబు చెప్పడం ద్వారానే జనాల్లోకి తన సందేశం వెళ్లేలా చూసుకోవాలని అంటున్నారు.

ఏది ఏమైనా జగన్ అయిదేళ్ళ పాటు సీఎంగా మీడియాను ఎక్కడా ఫేస్ చేయలేదు. ఇపుడు విపక్ష నేతగా ఉంటున్నారు. ఆయనకు మీడియా అవసరం చాలా ఉంది. అలాగే మీడియాను హ్యాండిల్ చేయడమూ కాస్తా ఇబ్బందిగానే ఉండొచ్చు.

ఎందుకంటే మీడియా కూడా పొలిటికల్ గా చూస్తే వర్టికల్ గా విడిపోయింది. దాంతో పార్టీ సమావేశాలకు అయితే తమకు నచ్చని మీడియాను నిషేధించవచ్చు. కానీ బయట మీడియాను అడ్రస్ చేసినపుడు అందరూ వస్తారు. వారు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పి తీరాల్సి ఉంటుంది. ఇవన్నీ కొంత ఇరకాటం అయినా పాలిటిక్స్ లో తప్పదు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే మీడియాతో టచ్ లో ఉండడం జనంలో ఉండడం ప్రతిపక్ష నేతలకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. వారిని లైవ్ లో ఉంచాలంటే ఇదే సరైన రూట్ అంటున్నారు. జగన్ మీడియాతో ఇక మీదట ఎలా హ్యాండిల్ చేస్తూ సాగుతారు అన్న ఆసక్తి అయితే ఉంది.

Tags:    

Similar News