జగన్ ఉగాది పచ్చడి అంతా తీపేనట...!

ఈ యాత్రలో భాగంగా వచ్చే నెల 9వ తేదీన ఆయన విజయవాడలో జరిగే ఉగాది పండుగలో పాల్గొంటారు.

Update: 2024-03-23 15:21 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీకి సంబంధించిన మ్యానిఫేస్టో ని ఉగాది రోజున రిలీజ్ చేస్తున్నారు. ఆయన మేమంతా సిద్ధం పేరుతో ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా వచ్చే నెల 9వ తేదీన ఆయన విజయవాడలో జరిగే ఉగాది పండుగలో పాల్గొంటారు.

అక్కడే పంచాంగ శ్రవణం విన్న అనంతరం జగన్ వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. వైసీపీ ఎన్నికల మ్యేనిఫేస్ట్లో ఉగాది పచ్చడిలో మాదిరిగా తీపి కారం, పులుపు వగరు, చేదు వంటివి కాకుండా కేవలం తీపితోనే నింపేస్తారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఇక 2019 ఎన్నికల వేళ జగన్ నవరత్నాలు పేరుతో ఎన్నికల ప్రణాళికను జనం ముందుకు తీసుకుని వచ్చారు. ఈసారి అంతకంటే మరింతంగా ఆకట్టుకునేలా కీలక హామీలతో ఎన్నికల ప్రణాళిక ఉంటుందని అంటున్నారు. ఈసారి కూడా వివిధ వర్గాల కోసం హామీలు ఇస్తారని అంటున్నారు.

ఇందులో రైతుల కోసం రుణ మాఫీ హామీ ఉంటుందని అది కూడా లక్ష రూపాయలా లేక రెండు లక్షల రూపాయలా అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు అని అంటున్నారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అని మరో కీలక ప్రకటన చేస్తారు అని అంటున్నారు.

ఇక పట్టణంలో మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రణాళికలో హామీలు ఉంటాయని అంటున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం వరాలు ఉంటాయని యువత, నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ వైసీపీ మ్యానిఫేస్టో తయారు అవుతోంది అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే జగన్ 2019 ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలకు ఏటా డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకూ బడ్జెట్ లో ఖర్చు అవుతోంది. వాటిని కంటిన్యూ చేస్తూనే కొత్త హామీలు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా లక్ష కోట్ల పై దాటుతాయని అంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో రెండేళ్ళ పాటు కరోనా వల్ల పోయిందని ఈసారి మాత్రం అయిదేళ్ళూ ఆర్ధిక అభివృద్ధి సవ్యంగా సాగి ఖజానాను మంచి రాబడి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. దాంతో కాస్తా చేయి విదిల్చి భారీ హామీలకే ఆ పార్టీ సిద్ధం అవుతోంది

తాము ఇచ్చే హామీలను జనాలు కచ్చితంగా నమ్ముతారని ఎందుకంటే 2019 నుంచి 2024 వరకూ తమ పాలనలో చేసి చూపించామని అంటున్నారు. ఇక ఏప్రిల్ 9న మ్యానిఫేస్టో రిలీజ్ చేస్తే అప్పటికి నెల రోజులు పైగా ఎన్నికలకు ఉంటుంది. దాంతో దాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకుని వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి చూస్తే వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో ఏముంది అన్నది ఇపుడు ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News