పొలిటికల్ పిక్చర్ : జగన్ ప్రమాణం...కసిగా చూస్తున్న లోకేష్!

జగన్ మాజీ ముఖ్యమంత్రి. కానీ ప్రతిపక్ష నేత కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యేగా కొత్త అసెంబ్లీలో ఆడుగు పెట్టారు

Update: 2024-06-21 06:49 GMT

జగన్ మాజీ ముఖ్యమంత్రి. కానీ ప్రతిపక్ష నేత కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యేగా కొత్త అసెంబ్లీలో ఆడుగు పెట్టారు. జగన్ పేరు అక్షర క్రమంలో పిలుస్తారని ఇంటి పేరు వై తో స్టార్ట్ అవుతుంది కాబట్టి శనివారం ఆయన ప్రమాణం ఉండొచ్చు అని అంతా అనుకున్నారు.

కానీ అలా కాకుండా విపక్షం నుంచి ప్రాధాన్యత ఇస్తూ ఆయన పేరుని సీఎం మంత్రుల తరువాత పిలిచారు. అయితే జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న క్రమంలో ఒక ముచ్చట చోటు చేసుకుంది. సభలో మొత్తం ఉన్న అధికార కూటమి సభ్యులు అంతా ఆయననే చూస్తూండిపోయారు.

ప్రత్యేకించి ముందు వరసలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ అయితే జగన్ ప్రమాణం చేస్తున్నంతసేపూ అలా చూస్తూండిపోయారు. లోకేష్ మదిలో భావాలు ఏమిటో తెలియదు కానీ ఆమె ఫేస్ చూస్తే కసిగా జగన్ వైపు చూస్తున్నట్లుగా అనిపించింది అని అంటున్నారు.

జగన్ వర్సెస్ బాబుగా 2024 ఎన్నికలు జరిగాయి. ఇక నారా లోకేష్ యువ నేతగా టీడీపీ విజయంలో కొమ్ము కాశారు. ఆ టైంలో ఆయన జగన్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. మరో వైపు చూస్తే జగన్ కూడా ఇండైరెక్ట్ గా నారా లోకేష్ మీద సెటైర్లు వెస్తూ వచ్చారు.

ఈ ఇద్దరూ ఒకటి రెండు సందర్భలలో తప్ప ఎపుడూ ఎదురుపడలేదు. 2019లో శాసనమండలిలో నారా లోకేష్ విపక్షంలో ఎమ్మెల్సీగా ఉన్నపుడు ఒకసారి సభకు సీఎం హోదాలో జగన్ వచ్చారు. అపుడు అందరితో పాటు లోకేష్ లేచి ఆయనకు నమస్కరించారు. అది 2019 కొత్తల్లో. ఆ తరువాత వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న రాజకీయ సమరం చాలా తీవ్రంగా సాగింది.

దాంతో అయిదేళ్ళు గిర్రున తిరిగేసరికి అది కాస్తా వ్యక్తిగత స్థాయిలోనూ సాగిపోయింది. అయితే ఎన్నికలు రాజకీయాలు అన్నీ ప్రజాస్వామ్యం అన్న దాంట్లోనే ముడి పడి ఉంటాయి. ఎవరైనా అంతిమంగా ప్రజలకు సేవ చేయడానికే ఉంటారు. దాంతో ఈసారి అయినా అసెంబ్లీలో వివాదాలు చోటు చేసుకోకుండా ప్రజా సమస్యల మీద అదే స్పిరిట్ తో అంతా పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

అయితే ఈసారి అసెంబ్లీ తీరు తెన్నులు చూస్తే అది సాధ్యపడుతుందా అంటే ఏదైనా సాధ్యమే అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా నారా లోకేష్ జగన్ వైపు అదే పనిగా రెప్పార్చకుండా చూడడం మాత్రం పొలిటికల్ పిక్చర్ గా మారి తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News