జగన్ ఫ్లెక్స్ @ కేశినేని భవన్... పిక్స్ వైరల్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-01-19 11:22 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ టీడీపీలో కీలక నేతగా ఉన్న కేశినేని నాని టీడిపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ లపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇదే సమయంలో విజయవాడలోని పలువురు టీడీపీ నేతలనూ వాయించి వదిలారు! ఈ సమయంలో విజయవాడలోని కేశినేని భవన్ వద్ద ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది.


అవును... ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు బెజవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయిన ఆయన... వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ పై విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఈ సమయంలో ఆయన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుని జగన్ తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు.

ఈ క్రమంలో సంక్రాంతికి ముందే... బెజవాడలోని కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు. టీడీపీ, చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను సిబ్బంది తీసేశారు. ఆ సమయంలో కేవలం.. కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. అయితే తాజాగా సరికొత్త ఫ్లెక్సీలతో కేశినేని భవన్ ను నింపేశారు.

ఇందులో భాగంగా... కేశినేని భవన్‌ లో తొలిసారిగా వైఎస్‌ జగన్‌ బ్యానర్‌ కనిపించింది. ఈ భవనంపై కేశినేని నాని వైఎస్ జగన్ తో ఉన్న ఫోటోతో పాటు.. జగన్ సింగిల్ గా ఉన్న ఫోటోలను ఉంచారు. దీంతో ఆ భవన్ కు సరికొత్త లుక్ వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు బెజవాడ రాజకీయాల్లో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News