సిద్ధం 4 @ చంద్రబాబు...!

సిద్ధం నాలుగవది చివరిది అయిన సభ మొత్తం చంద్రబాబుకే అంకితం ఇచ్చినట్లుగా సాగింది అన్న విమర్శలు వచ్చి పడుతున్నాయి.

Update: 2024-03-11 08:45 GMT

సిద్ధం నాలుగవది చివరిది అయిన సభ మొత్తం చంద్రబాబుకే అంకితం ఇచ్చినట్లుగా సాగింది అన్న విమర్శలు వచ్చి పడుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గంటా పది నిముషాల సేపు సుదీర్ఘంగా మాట్లాడారు. నిజానికి జగన్ ఇంత ఎక్కువగా ఇప్పటిదాకా ఏ సభలోనూ మాట్లాడలేదు. ఆయన గంటకు పైబడి చేసిన స్పీచ్ లో ఎక్కువ భాగం చంద్రబాబుని విమర్శించడానికే కేటాయించారు అని అంటున్నారు.

అదే సమయంలో ఒకింత బోర్ కొట్టించారు అని కూడా అంటున్నారు. ఎంతసేపూ బాబుని విమర్శిస్తూ జగన్ చేస్తూ పోయిన ప్రసంగం వల్ల విసుగు వచ్చిందని టాక్ అయితే ఉంది. జగన్ ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు అని అధికార పార్టీ వారు అనుకోవచ్చు కానీ అసలు విషయం మిస్ అయిందని మిగిలిన వారు అంటున్నారు

అసలు సిద్ధం సభలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తారు అని ఆ పార్టీ పెద్ద నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. దానికోసమే మీడియాతో పాటు రాజకీయ వర్గాలు అన్నింటికీ మించి వైసీపీ వర్గాలు ఆసక్తిగా చూసాయి. తీరా మీటింగ్ పెట్టాక ఆ ఊసే లేకుండా పోయింది. మిగిలిన సభలకూ దీనికీ మధ్య ప్రత్యేకత ఏమీ లేకుండా పోయింది అని అంటున్నారు.

ఇక సిద్ధం చివరి సభకు పది లక్షలకు పైగా జనాలు వస్తారని ముందు నుంచి చెబుతూ వచ్చారు. కానీ వచ్చినది నాలుగు లక్షల దాకానే అని అంటున్నారు. జగన్ ప్రసంగం రొటీన్ గా ఉందని కూడా విమర్శలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద జగన్ విమర్శలు చేసినా లైట్ గానే ఉన్నాయని, మొత్తం బాబునే ఆయన టార్గెట్ చేశారు అని అంటున్నారు.

ఇక ఇదే సభలో ఎన్నికల ప్రణాళిక త్వరలో ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సిద్ధం సభలో మాత్రం దానిని విడుదల చేయలేదు. దాంతో ఎందుకు ఇలా జరిగింది అన్నది చర్చనీయాంశంగా ఉంది. సిద్ధం సభలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేయాలని మొదట అనుకున్నారని అయితే ఫోకస్ దాని మీదనే ఉంటూ అసలు విషయం వెనక్కు వెళ్తుంది కాబట్టే విడుదల చేయలేదు అని అంటున్నారు.

అసలు విషయం ఏమిటి అంటే చంద్రబాబుని విమర్శించడం అని అంటున్నారు. బాబు ఎలాంటి వారో చెబుతూ తమ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి మధ్యన తేడా చూడాలని జగన్ కోరారు. అలాగే తాను అమలు చేసిన హామీల గురించి చెబుతూ బాబు హామీలలో డొల్లతనాన్ని ఎండగట్టారు. ఇవన్నీ కూడా హైలెట్ కావాలనే ఎన్నికల ప్రణాళిక త్వరలో అని చెప్పు ఊరుకున్నారు అని అంటున్నారు.

ఇక సిద్ధం సభ ద్వారా చంద్రబాబు తనకు అసలైన ప్రత్యర్ధి ఏడున్నర పదుల వయసు కలిగిన చంద్రబాబే అని మరోసారి చాటి చెప్పినట్లు అయింది. కూటమిలో ఎన్నో పార్టీలు ఉండొచ్చు. రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబే అని అందరికీ తెలిసిన విషయమే.

అందుకే మిగిలిన వారిని లైట్ చేస్తూ బాబు మీదనే జగన్ టార్గెట్ చేసారు అని అంటున్నారు. అంతే కాదు వైసీపీని పొత్తులతో ఎదుర్క్కోవాలన్న అజెండాతో బాబు ముందుకు వచ్చి బీజేపీని ఒప్పించుకుని మరీ పొత్తులని కలిపారు. దాంతో ఈ పొత్తుల వల్ల కేంద్ర ప్రభుత్వం దన్ను టీడీపీకి దొరికినట్లు అయింది అని అంటున్నారు.

రేపటి ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ కోసమే బాబు ఇలా చేశారు అని అంతా అనుకుంటున్నారు. ఆ విషయం మీద అవగాహన ఉండబట్టే జగన్ బాబు వైఖరిని ఈ సభ ద్వారా ఎండగట్టారు అని అంటున్నారు. ఇక బాబు గుండు సున్నా అని చెప్పడం ద్వారా టీడీపీ వెనక ఎంతమంది ఉన్నా విజయం తమదే అని జగన్ చెప్పినట్లు అయింది అని అంటున్నారు.

బాబుని జగన్ పూర్తి స్థాయిలో విమర్శించారు ఆయనకు ఓటు వేయవద్దు అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పధకాలు అన్నీ పోతాయని కూడా హెచ్చరించారు. మరి సిద్ధం సభ ద్వారా జగన్ చేసిన ఈ ప్రసంగం జనాల బుర్రలోకి వెళ్ళిందా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News