పవన్ సీటు మీద వైసీపీ ఫుల్ ఫోకస్...జగన్ టూర్ కన్ ఫర్మ్...!

పవన్ పిఠాపురం సీటు అని అనౌన్స్ చేయగానే చెలరేగిన రచ్చ టీడీపీలో ఏర్పడిన అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని వైసీపీ పధక రచన చేస్తోంది.

Update: 2024-03-16 03:35 GMT

అనుకున్నదే అవుతోంది. అందరూ ఊహిస్తున్నదే అవుతోంది. ఇది ఇలాగే జరుగుతుంది కూడా. రాజకీయాల్లో ప్రత్యర్ధులను ఎవరూ విడిచిపెట్టారు. వారిని ఓడించాలనే చూస్తారు. జగన్ పోటీ చేస్తున్న పులివెందుల సీటులో ఆయన్ని ఓడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయకుండా ఉంటారా. అలాగే వ్యూహాలు రచించకుండా ఉంటారా.

సెమ్ టూ సెమ్ కుప్పంలో బాబుని మంగళగిరిలో లోకేష్ ని ఓడించాలని వైసీపీ ఇప్పటికే పదునైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇపుడు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం సీటు మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని అంటున్నారు. పవన్ పిఠాపురం సీటు అని అనౌన్స్ చేయగానే చెలరేగిన రచ్చ టీడీపీలో ఏర్పడిన అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని వైసీపీ పధక రచన చేస్తోంది.

ఇక వైసీపీ అధినాయకత్వానికి అత్యంత నమ్మకస్తుడు విధేయుడు అయిన ఎంపీ మిధున్ రెడ్డిని ఏకంగా పిఠాపురం ఎన్నికల ఇంచార్జిగా వైసీపీ రంగంలోకి దించుతోంది. చిత్రమేంటి అంటే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పంలో బాబుని ఓడించమని బిగ్ టాస్క్ ఇచ్చిన జగన్ పవన్ విషయం మిధున్ రెడ్డికి అప్పగించారు అన్న మాట.

పవన్ ని 2019 ఎన్నికల్లో భీమవరం గాజువాకలలో ఓడించింది వైసీపీ. అపుడు ఏయే వ్యూహాలను రచించారో ఇపుడు అలాంటివే రచిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు నిరంతరం జనసేన ఓటమి కోరుతూ భారీ ప్రచారం చేయడానికి పార్టీ ముఖ్యులతో ఒక స్పెషల్ టీం ని ఎంపిక చేసి పిఠాపురం పంపుతారు అని అంటున్నారు.

పిఠాపురంలో వంగా గీతను గెలిపించే బాధ్యతను మిధున్ రెడ్డికే జగన్ అప్పగించారు అని అంటున్నారు. అదే విధంగా పార్టీలో చేరిన కాపు నేత ముద్రగడ పద్మనాభం సేవలను పూర్తిగా వాడుకోవాలని పార్టీ నిర్ణయించింది అని అంటున్నారు. అదే విధంగా జగన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో కీలక టైంలో పిఠాపురంలో ల్యాండ్ అవుతారు అని అంటున్నారు.

సరిగ్గా పోలింగ్ దగ్గర పడుతున్న వేళ జగన్ పిఠాపురం ఎన్నికల ప్రచారం ఉంటుంది అని అంటున్నారు. గతంలో గాజువాక, భీమవరం లో జగన్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ లో వచ్చి మొత్తం వ్యవహారాన్ని కీలక మలుపు తిప్పారు. ఇపుడు అలాగే చేస్తారు అని అంటున్నారు.

ఇప్పటికే వంగా గీత ప్రచారంలో చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇక వైసీపీ అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించాక పిఠాపురాన్ని టార్గెట్ చేసుకుని వైసీపీ టీం పోలింగ్ రోజు దాకా పనిచేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి పవన్ని ఈసారి కూడా ఓడించాలని ఆయనను అసెంబ్లీకి రాకుండా చేయాలని వైసీపీ శపధం పట్టింది. మరి అది సాధ్యపడుతుందా పవన్ వ్యూహాలు ఏంటి టీడీపీ ఉమ్మడిగా అందించే సాయం ఏంటి అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News