జగన్ బీ అలర్ట్: ఎన్నికల ముఖ్యమంత్రి ముద్ర పడుతోందా?
ఒక్క విషయంపై ఆయన అధికారులతో ముఖాముఖి మాట్లాడింది కూడా లేదు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు తెరదీసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో పాలన స్తంభించి పోయిందనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 26 తర్వాత.. సీఎం జగన్ కూడా ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఒక్క సమీక్ష చేసింది లేదు. ఒక్క విషయంపై ఆయన అధికారులతో ముఖాముఖి మాట్లాడింది కూడా లేదు. తెరవెనుక ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారో లేదో కూడా తెలియదు.
కానీ, రాష్ట్రంలో పరిస్థితి మాత్రం ఇబ్బందిగా ఉంది. చేపల వేటపై అధికారులు నిషేధం విధించారు. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు మత్స్యకారులపై ఈ నిషేధం ఉంటుందని ప్రకటించారు. ఈ సమయంలో వారికి ఉపాధి లేకుండా పోతుంది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి.. ఈ పరిస్థితి సమీక్షించి.. ఆయా కుటుంబా లను ఈ కష్ట కాలంలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, దీనిపై సీఎం జగన్ పట్టనట్టే వ్యవహరిస్తు న్నారు.
ఇక, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయింది. కొన్ని కొన్ని జిల్లాల్లో 45.5 డిగ్రీల అసాధార ణ గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అదేసయమంలో వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేలా.. సీఎం స్తానంలో ఉన్న వ్యక్తి.. అధికార యంత్రాంగా నికి దిశానిర్దేశం చేయాలి. కానీ, అది కూడా చేయలేదు. అదేసమయంలో వచ్చే మే 1 న పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇది వివాదం అయిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఆయనే చూసుకోవాలి. కానీ, దీనిపైనా ముందస్తు ప్రణాళికకు సీఎం సిద్ధమైనట్టు కనిపించడం లేదు.
పోనీ.. షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో సీఎం అసలు పూర్తిగా చేతులు కట్టుకోవాలని ఏమైనా నిబంధన ఉందా? అంటే.. అది కూడా లేదు. విధానపరమైన నిర్ణయాలు మినహా పాలన విషయంలో సీఎం సుప్రీం. ఆపద్ధర్మ ప్రభుత్వమే అయినా.. సీఎం ఆదేశాలు ఇవ్వవచ్చు. శాంతి భద్రతల అంశంపై సమీక్ష చేయొచ్చు. ఉష్ణోగ్రతలు , ప్రకృతి విపత్తులు వంటి అంశాలపైనా చర్చించవచ్చు.
కానీ, జగన్ మాత్రం ఎన్నికలకే పరిమితమయ్యారు. మరోవైపు పీఎం మోడీ మాత్రం ఉష్ణోగ్రతలు, దేశ భద్రత వంటి అంశాలపై నిరంతరం సమీక్షలుచేస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తుండడం గమనార్హం. దీంతో సీఎం జగన్‌పై ఎన్నికల ముఖ్యమంత్రిగా ముద్ర పడే అవకాశం ఉందని.. ఇది ఎన్నికలప్రచారంలోకి వస్తే.. ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతుండడం గమనార్హం.