బీచ్ లో బీకేర్ ఫుల్... మాంసం తినే ఈ బాక్టీరియా గురించి తెలుసుకోండి!

సాధారణంగా సముద్రాన్ని చూడగానే... బీచ్ లో స్నాహానికి దిగాలని, సరదగా కేరింతలు కొట్టాలని, కెరటాలతో మజా చేయాలని అనిపిస్తుండటం సహజం.

Update: 2023-08-31 04:55 GMT

సాధారణంగా సముద్రాన్ని చూడగానే... బీచ్ లో స్నాహానికి దిగాలని, సరదగా కేరింతలు కొట్టాలని, కెరటాలతో మజా చేయాలని అనిపిస్తుండటం సహజం. బీచ్ లో బాత్ చేస్తే ఆ ఆనందమే వేరనే వారూ పుష్కలంగా ఉంటారు. ఈ సమయంలో బీచ్ లో స్నానానికి వెళ్లి.. స్నానం చేసి.. ప్రాణాలమీదకు తెచ్చుకుంది ఓ మహిళ!

బీచ్ లో స్నానానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుందంటే... అదేదో కెరటాలకు కొట్టుకుపోయే, నీటిలో ఊపిరాడకో, ఏ చేపో గాయం చేసో కాదు సుమా... జస్ట్ ఎలా జరిగిందో, ఏమి జరిగిందో తెలియని నీటి రాపిడికి ఏర్పడిన చిన్న గాయం కారణంగా! నమ్మసక్యంగా లేకపోయినా... ఇది నిజం!

వివరాళ్లోకి వెళ్తే... జెన్నిఫర్‌ బార్లో(33) అనే మహిళ యూఎస్‌ లోని బహామాస్‌ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో సముద్రపు నీటివల్ల కాలికి చిన్న గాయం అయ్యింది. పైగా పరిగణలోకి తీసుకోవాల్సినంత గాయం కాదని భావించిందో ఏమో... జస్ట్ ఏదో చిన్న క్రీం, ఐస్ క్రీం వంటివి దానిపై రాసి లైట్ తీసుకుంది.

అయితే ఎన్ని రోజులైనా ఈ చిన్ని గాయం మానడం లేదు. చిన్న చీమ కన్నంత గాయం కాస్తా... బలమైన రాడ్ తో కొట్టిన గాయంగా మారిపోవడం మొదలుపెట్టింది. దీంతో ఆమె ఆందోళన చెందింది. ఈ క్రమంలో ఒకరోజు స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. దీంతో విషయం గ్రహించిన ఆమె సోదరుడు హుఠాహుటిన ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు.

ఈమె పరిస్థితిని గమనించిన వైద్యులు.. పరీక్షల అనంతరం.. ఆమె సెప్టిక్‌ షాక్‌ తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. ఈ క్రమంలో ఆమె కాలు బాగా వాచిపోయి ఉండటమే కాకుండా... అక్కడ చర్మం అంతా వేడిగా మారిపోయింది. శరీరం మొత్తం ఉండే వేడికి.. ఆ ఒక్క చోట ఉండే వేడికీ సంబంధం లేనంతగా వేడెక్కిపోయింది.

ఈ సమయంలో సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉండిపోయింది. బాక్టీరియా ఆమె రక్త ప్రవాహంలో ప్రవేశించడంతో ఇది జరిగిందని వైద్యులు తెలిపారు. అలా మెదడుపై ప్రభావం చూపించిన ఆ బాక్టీరియా... అనంతరం కిడ్నీ, లివర్ లపై కూడా ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది.

పరిస్థితిని గమనించిన వైద్యులు... ఆ గాయం అయిన ప్రాంతంలో కణజాలాన్ని తొలగించడానికి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ బాక్టీరియా విస్తరణ కారణంగా సుమారు 12 ఆపరేషన్ లు చేశారు. అయినా కూడా ఫలితం లేకపోవడంతో... వైద్యులు ఆఖరికి ఆమె కాలును తీసేశారు. చిన్న బాక్టీరియా అనుకుంటే... అది కాస్త ఇంతపనిచేసింది.

ఈ విషయాలపై యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ స్పందించింది. ఇందులో భాగంగా... అమెరికాలో ప్రతీ ఏటా సుమారు 500 నుంచి 1500 దాక నెక్రోటైజింగ్‌ ఫాసిటిస్‌ కి సంబంధించని కేసులు వస్తున్నాయని పేర్కొంది. ఇదే సమయంలో వాటిలో సుమారు 20శాతం ప్రాణాంతకమైనవని వెల్లడించింది.

ఇదే క్రమంలో... ఈ ఇన్ఫెక్షన్‌ కారణంగా ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. సో... ఇకపై బీచ్‌ ల వద్ద జాగ్రత్తగా ఉండాలి. సముద్రపు నీటిలో ఎంజాయ్‌ చేసేటప్పుడు ఏదైనా చిన్న గాయం అయితే వెంటనే వైద్యులను సంప్రదించడం బెటర్ అన్నమాట!!

Tags:    

Similar News