కామెడీ : కవిత ఒత్తిడికి మోడీ లొంగిపోయి మహిళా బిల్లును పెట్టారు!

కల్వకుంట్ల కవిత వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తనకు సంబంధంలేని అంశాల్లో ఎక్కడ పాజిటివ్ డెవలప్మెంట్ జరిగినా వెంటనే తనవల్లే అని రంగంలోకి దూకేస్తారు

Update: 2023-09-20 06:06 GMT

కల్వకుంట్ల కవిత వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తనకు సంబంధంలేని అంశాల్లో ఎక్కడ పాజిటివ్ డెవలప్మెంట్ జరిగినా వెంటనే తనవల్లే అని రంగంలోకి దూకేస్తారు. ఇపుడు విషయం ఏమిటంటే పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ బిల్లుపై చర్చలు జరిగిన తర్వాత చట్టంగా మారబోతోంది. అన్ని పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి బిల్లు చట్టంగా మారటంలో పెద్ద సమస్యలేమీ ఎదురయ్యే అవకాశాలు లేవు.

ఇలాంటి నేపధ్యంలోనే కవితతో పాటు బీఆర్ఎస్ నేతలు కొందరు చాలా హడావిడి చేస్తున్నారు. కారణం ఏమిటంటే కవిత చొరవ వల్లే, ఒత్తిడి వల్లే పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు డప్పుకొట్టుకుంటున్నారు. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు కవితకు ఎలాంటి సంబంధం లేదు. ఒక బిల్లు విషయమై కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేంత సీన్ కవితకు లేదని అందరికీ తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కాం నుండి తప్పించుకునేందుకు మాత్రమే ఆ మధ్య కవిత ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లంటు హడావుడి చేశారు.

అంతమాత్రాన కవిత ఒత్తిడికి నరేంద్ర మోడీ ప్రభుత్వం లొంగిపోయి బిల్లును తయారు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టేస్తుందా ? వినేవాళ్ళ చెవుల్లో పూలు పెట్టేస్తున్నారు కవితో పాటు మహిళా నేతలు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టించేత సీనే కవితకు ఉంటే మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విషయాన్ని ఎందుకు వదిలేసినట్లు ?

పార్లమెంటులో చట్టమైతే కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వర్తింపజేసేందుకు లేదని అందరికీ తెలుసు. కానీ చట్టం అని కాకుండా అసెంబ్లీ టికెట్లలో 33 శాతం మహిళలక కేసీయార్ కేటాయిస్తానంటే ఎవరైనా అడ్డుకుంటారా ? తన తండ్రి కేసీయార్ తో చెప్పి 33 శాతం రిజర్వేషన్ పద్దతిలో 39 సీట్లను కవిత ఎందుకని ఇప్పించలేకపోయారు ? వినేవాళ్ళుంటే కవితో పాటు బీఆర్ఎస్ నేతలు ఎన్ని సొల్లుకబుర్లయినా చెబుతారు. పార్లమెంటులో బిల్లుకు కవితకు ఎలాంటి సంబంధంలేదు. ప్రతిపక్షాలన్నింటినీ ముఖ్యంగా ఇండియాకూటమిని దెబ్బకొట్టాలని నరేంద్రమోడీ అనుకున్నారు అందుకనే మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తున్నారంటే.

Tags:    

Similar News