తడబడిన హారీస్.. అది లేకుండా కమలా మాట్లాడలేరా..?

అమెరికా ఎన్నికలు హోరాహోరీగా నడుస్తున్నాయి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో తలపడిన వారే ఈ ఎన్నికల్లోనూ పోటీపడుతున్నారు.

Update: 2024-10-05 14:30 GMT

అమెరికా ఎన్నికలు హోరాహోరీగా నడుస్తున్నాయి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో తలపడిన వారే ఈ ఎన్నికల్లోనూ పోటీపడుతున్నారు. అనూహ్యంగా గత జూలైలో అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి తప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారీస్ అధ్యక్ష బరిలో నిలిచారు. ఇక ప్రత్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలిచారు. దీంతో అప్పటి నుంచి వారిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది.

గతంలో అధ్యక్షుడిగా కొనసాగిన ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా..? లేదంటే ప్రస్తుతం వైస్ ప్రెసిడెంటుగా ఉన్న కమలా హారీస్‌నే అధ్యక్షురాలిగా గెలిపిస్తారా అని ఆసక్తికరంగా మారింది. ఈ ఆసక్తి కేవలం అమెరికా వరకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ కొనసాగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

ఇప్పటికే పలు సభలు, సమావేశాలతో ఇద్దరు అభ్యర్థులు కూడా దూసుకెళ్తున్నారు. ఇటీవల ప్రముఖ మీడియా ఆధ్వర్యంలోనూ ఓ డిబేట్ నిర్వహించింది. ఆ డిబేట్‌లో కమలా హారీస్ తనదైన శైలిలో సమాధానలు ఇస్తూ.. ట్రంప్‌ను పలు ప్రశ్నలపై నిలదీస్తూ పైచేయి సాధించారని టాక్ ఉంది. మరోవైపు.. దేశవ్యాప్తంగానూ పలు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ కమలా హారీస్‌దే పైచేయి అన్నట్లుగా రిజల్ట్స్ వచ్చాయి.

డిబేట్‌లో భాగంగా ట్రంప్‌కు చుక్కలు చూపించిన కమలా.. ఇటీవల ఓ ప్రసంగంలో తడబడ్డారు. అయితే.. దీనికి ప్రధానంగా ఓ కారణం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలా హారీస్ మిచిగాన్‌లోని ఓ సభలో ప్రసంగించారు. అయితే ఆమె మాట్లాడుతున్న సమయంలో ఆమె తడబ్బడారు. మాట్లాడుతున్న సమయంలో సాధారణంగా ఆమెకు టెలీ ప్రాంప్టర్ మాటలు అందిస్తుంటుంది. అయితే.. ఈ సభలో మాట్లాడుతున్న సమయంలో టెలీ ప్రాంప్టర్ పనిచేయడం ఆగిపోయింది. దాంతో ఆమె మాట్లాడడంలో తడబడ్డారు. ఎన్నికలకు ఇంకా 32 రోజులు ఉన్నాయి. 32 రోజులు ఉన్నాయి అంటూ పదేపదే ప్రస్తావించారు. దీంతో ఆమెపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రాంప్టర్ సాయం లేకుండా ఆమె మాట్లాడలేరనే ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News