'క‌న్నా' అల‌క‌కు కార‌ణం ఇదేనా..!

ఆయ‌న ఒక్క‌రే కాకుండా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

Update: 2025-01-30 00:30 GMT

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ. సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకుని.. స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌తంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేసిన ఆయ‌న గ‌త నాలుగు మాసాల నుంచి కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు ఏరికోరి ఆయ‌న‌ను పిలిచి మ‌రీ కండువా క‌ప్పి టికెట్ ఇచ్చారు. స‌త్తెన‌ప‌ల్లిలో ప్ర‌చారం కూడా చేశారు. ఆయ‌న ఒక్క‌రే కాకుండా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

అయితే.. గెలిచిన త‌ర్వాత ఎక్క‌డా క‌న్నా క‌నిపించ‌డం లేదు. కొన్ని రోజులు అనారోగ్య స‌మ‌స్య‌లతో ఆయ న దూరంగా ఉన్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. త‌ర్వాత వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో దూరం పాటిస్తున్నార‌న్న చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఏదేమైనా కీల‌క‌మైన అసెంబ్లీ స‌మావేశాల నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల వ‌ర‌కు కూడా ఎక్క‌డా క‌న్నా క‌నిపించ‌డ‌మే మానేశారు. దీనికి మ‌రో కార‌ణంపై పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగింది. మంత్రి ప‌ద‌విని ఆశించార‌ని.. కానీ, చంద్ర‌బాబు ఇవ్వ‌లేద‌ని అందుకే అలిగార‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ‌ల్లో ఉంది.

కానీ, తాజాగా మ‌రో విష‌యం వెలుగు చూసింది. స‌త్తెన‌ప‌ల్లి టికెట్‌ను ఆశించిన‌.. కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న యుడు కోడెల శివ‌రామ‌కృష్ణ‌తో క‌న్నా విభేదించార‌న్న‌ది పార్టీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌గా ఉంది. ఇద్ద‌రు క‌లిసి ఉన్న‌ప్పుడు బాగానే ఉంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి కోడెల కు ద‌క్కాల్సిన ఈ సీటును చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహంలో భాగంగా క‌న్నాకు ఇచ్చారు. దీంతో కోడెల శివ‌రామ‌కృష్ణ‌.. కొన్నాళ్లు అలిగినా.. ఆయ‌న‌ను పార్టీ పెద్ద‌లు బుజ్జ‌గించారు. అనంత‌రం ప‌రిస్థితి స‌ర్దుకుంది.

కానీ, క‌న్నా గెలిచిన త‌ర్వాత‌.. వ్య‌క్తిగ‌త వ్యాపార విభేదాలు మొద‌ల‌య్యాయ‌ని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో అధిష్టానం సీరియ‌స్ అయింద‌ని.. ఇద్ద‌రినీ పిలిచి మంద‌లించింద‌ని అంటున్నారు. కోడెల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. క‌న్నా మాత్రం అధిష్టానం మంద‌లింపుపై బాగానే హ‌ర్ట‌యిన‌ట్టు చెబుతున్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోగా.. నియోజ‌క‌వ‌ర్గంలోనూత‌న‌కు విలువ లేకుండా పోయింద‌ని.. ఆయ‌న ఆరోపిస్తున్నారట‌. ఈ నేప‌థ్యంలోనే పార్టీకి క‌డు దూరంగా ఉంటున్నారన్న‌ది టీడీపీ వ‌ర్గాల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి దీనిలో ఎంత వ‌ర‌కు వాస్త‌వం ఉందో క‌న్నా మీడియా ముందుకు వ‌స్తేనే తెలుస్తుంది.

Tags:    

Similar News