పాల్ గారి 'కుండ' క‌హానీ విన్నారా?

తాజాగా పాల్ పార్టీ 'ప్ర‌జాశాంతి'కి కేంద్ర ఎన్నిక‌ల సంఘంప్ర‌స్తుత అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ‌.. 'కుండ‌' సింబ‌ల్‌ను కేటాయించింది.

Update: 2024-04-13 04:10 GMT

కిలారి ఆనంద పాల్‌.. కేఏ పాల్.. నోరు తెరిస్తే.. క్యామెడీ ప‌రుగులు పెడుతుంది. ఆయ‌న ఎంత సీరియ‌స్‌గా ఏ విష‌యం చెప్పాల‌ని అనుకున్నా.. అదేంటో కానీ.. ఆయ‌న మాట‌లు వింటే న‌వ్వు ఆపుకోలేని ప‌రిస్థితి. తాజాగా పాల్ పార్టీ 'ప్ర‌జాశాంతి'కి కేంద్ర ఎన్నిక‌ల సంఘంప్ర‌స్తుత అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ‌.. 'కుండ‌' సింబ‌ల్‌ను కేటాయించింది. గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌కు 'విజిల్‌' గుర్తును కేటాయించిన విష‌యం తెలిసిందే.

అయితే.. కుండ సింబ‌ల్ కేటాయించ‌గానే.. పాల్ స‌ర్ ప‌రుగులు పెట్టారు. హైద‌రాబాద్ శివారులోని కుమ్మ రుల ఇళ్ల‌కు వెళ్లి..ఆయ‌న వెంట ఒక‌టి రెండు మీడియా చానెళ్ల ప్ర‌తినిధులను కూడా తీసుకువెళ్లి 'కుండ' లు త‌యారు చేశారు. వీడియోలను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయాల‌ని కూడా దిశానిర్దేశం చేశారు. ఇక‌, పార్టీ కార్యాల‌యానికి చేరుకుని.. నేత‌లు.. బాబూమోహ‌న్ స‌హా ప‌ది మంది కుండ‌లు పంచి.. కుండ విశిష్ట త‌ల‌పై సుదీర్ఘ ప్ర‌సంగాలు చేశారు.

''మాకు కుండ సింబ‌ల్ కేటాయించారు. ఇదిచాలా మంచి నిర్ణ‌యం. ఇప్పుడు వేసవి కాలం.. ప్ర‌తిఒక్క‌రూ కుండ‌లో నీటిని తాగాల‌ని ఎదురు చూస్తారు. కుండ‌నీరు ఆరోగ్యానికి మంచిది. అలానే ప్ర‌జాశాంతి పార్టీ ప్ర‌జ‌ల‌కు మంచిది. రాష్ట్రాల‌కు మంచిది. దేశానికి మంచిది. కుండ పగిలిపోతు. పాడైపోదు. కుండ ఎంత పాత‌దైతే.. అంత మంచిది'' అని కుండ గురించి సోదాహ‌ర‌ణంగా ప్ర‌సంగించారు పాల్.

ఇదేస‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన‌కు కేటాయించిన గుర్తుపైనా స‌టైర్లు వేశారు. ''మా త‌మ్ముడు ప‌వ‌న్ కు గాజు గ్లాసు కేటాయించారు. గ్లాసు ఒక్క‌సారి తాగితే.. కడుక్కొవాలి. పైగా ప‌గిలిపోతుంద‌నే భ‌యం ఉంటుంది. కానీ, మా కుండ అలా కాదు. త‌ర‌త‌రాలుగా ఇళ్ల‌లో పెట్టుకుని వాడుకోవ‌చ్చు'' అని వ్యాఖ్యానించారు. తాము పోటీచేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో పేద‌లకు కుండ‌లు పంపిణీ చేసేందుకు ఎన్నిక‌ల సంఘం అనుమ‌తితీసుకుంటామ‌న్నారు.

Tags:    

Similar News