అరెస్టు తర్వాత కవితను ఆడేసుకోవటం ఎక్కువైందట

రోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి ఎమ్మెల్సీ కవిత అరెస్టు వేళ చోటు చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-03-18 13:45 GMT

రోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి ఎమ్మెల్సీ కవిత అరెస్టు వేళ చోటు చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో గులాబీ దళానికి సైతం దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ లేని రీతిలో మరీ ఇంత నెగిటివిటీ ఏంటి బాసూ? అంటూ చర్చించుకోవటం కనిపిస్తోంది. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఏదైనా కేసులో అరెస్టు జరిగినంతనే.. అప్పటివరకున్న ప్రతికూల వాతావరణం కాస్తా సానుకూలంగా మారిపోవటం ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఆమె అరెస్టు తర్వాత సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. తగిన శాస్తి జరిగిందని.. చేసిన తప్పుల్ని అధికారంలో ఉన్నప్పుడు కప్పిపుచ్చుకున్నా.. చివరకు జరగాల్సింది జరిగిందంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వందలో సుమారు 20 కంటే తక్కువగానే సానుకూల మెసేజ్ లు పోస్టు అవుతున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా ఆమె మీద మీమ్స్.. వీడియోలతో మరింతగా విరుచుకుపడుతున్నారు. ‘‘తవ్వకాల్లో బయటపడ్డ విలువైన కళాఖండం’’ పేరుతో ఒక చిట్టి వీడియోను పోస్టు చేయటం.. అది కాస్తా పెద్ద ఎత్తున వైరల్ కావటం జరిగింది.

అందులో సీనియర్ మహిళా జర్నలిస్టు ఒకరు ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో కవితను ఉద్దేశించి..మీరు ఒక వేళ ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం వస్తే ఏం చేస్తారంటూ ప్రశ్నించిన వైనం ఆ వీడియోలో కనిపిస్తుంది. అందుకు కవిత చెప్పిన సమాధానం ఇప్పుడు హైలెట్ గా మారింది. ఒకవేళ తనకు నిజంగా ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం వస్తే ఆల్కహాల్ లేకుండా చేస్తానని చెప్పటం కనిపిస్తుంది. ఆల్కహాల్ లేకపోతే ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వస్తుందని చెబుతారని.. తాను మాత్రం మద్య నిషేధ నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పిన వీడియో ఇప్పుడు భారీగా షేర్ అవుతోంది.

లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితక్క.. తాను సీఎం అయితే మాత్రం లిక్కర్ లేకుండా చేస్తానని చెప్పటంపై సోషల్ మీడియాలో భారీగా సెటైర్లు పేలుతున్నాయి. నిజంగానే ముఖ్యమంత్రి అయితే అక్క విజన్ నెక్ట్స్ లెవెల్ అని ఒకరు.. మీరు ఒక వర్గానికి స్ఫూర్తి అని మరొకరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో వీడియోలో ఈ తీరు మరింత ఎక్కువగా ఉంటుంది. శ్రీక్రిష్ణార్జున యుద్ధం మూవీలో అర్జునుడు, సుబద్ర పెళ్లి వేళ అప్పగింతల సమయాన వచ్చే ‘వేయి శుభములు కలుగు నీకు పోయి రావె మరదలా’ అన్న పాటకు.. తాజా పరిస్థితిని రిలేట్ చేస్తూ.. కవిత. శైలిమా (కేటీఆర్ సతీమణి) పేర్లు పెట్టారు. కోరస్ గా పాడే వేళ చెలికత్తలకు పింకీస్ అంటూ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడీ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అరెస్టు తర్వాత సానుభూతి వస్తుందనుకుంటే ఇంతలా వీడియోలతో విరుచుకుపడటం గులాబీ దళానికి అస్సలు అర్థం కావట్లేదన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News