గజ్వేల్ మీద ఒట్టు అంటున్న కేసీయార్...!

ఆయన చెప్పే వాటిని అలా వినేలా కూడా చేయగల సామర్థ్యం కేసీయార్ కే సొంతం. అలాంటి కేసీయార్ తన సొంత సీటు గజ్వేల్ మీద ఒట్టు పెట్టేశారు.

Update: 2023-10-20 16:22 GMT

బీయారెస్ అధినేత ముఖ్యమంత్రి కేసీయార్ మాటల చతురుడు అన్నది కూడా తెలిసిందే. ఆయన మాటలతో మంత్రముగ్దులను చేస్తారు. ఆయన చెప్పే వాటిని అలా వినేలా కూడా చేయగల సామర్థ్యం కేసీయార్ కే సొంతం. అలాంటి కేసీయార్ తన సొంత సీటు గజ్వేల్ మీద ఒట్టు పెట్టేశారు.

నిజంగా కేసీయార్ అంత పెద్ద ఒట్టు ఎందుకు పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే దాని వెనక చాలా పెద్ద కధ ఉందనే అనుకోవాలి. కేసీయార్ 2014 నుంచి గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అలా రెండు దఫాలుగా కేసీయార్ గజ్వేల్ నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేగా గెలిచారు.

అలాగే రెండు దఫాలుగా సీఎం గానూ ఉన్నారు ఇదిలా ఉంటే తాజాగా గజ్వేల్ లో జరిగిన ఎన్నికల సభలో కేసీయార్ మాట్లాడుతూ తాను గజ్వేల్ కి ఎమ్మెల్యేగా గత అయిదేళ్ళ కాలంలో ప్రజల వద్దకు రాలేకపోయాను అని విచారం వ్యక్తం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరు అన్నది కూడా డౌట్ వచ్చేలా తాను రాకపోవడం జరిగింది అని అన్నారు.

ఈ విషయం చెప్పడానికి ఆయన నొచ్చుకున్నారు. తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు బాగా తిరిగేవాడిని అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. పాదయాత్ర కూడా అప్పట్లో చేసానని పాత స్మృతులను నెమరేసుకున్నారు. అయితే గజ్వేల్ లో మాత్రం తాను అసలు తిరగలేదు అని తన తప్పుని సీఎం అంగీకరించారు. కానీ ఈసారి అలా కాదని మాట ఇస్తున్నాను అని కేసీయార్ ఒకటికి పది సార్లు జనానికి చెపుకున్నారు. ఈసారికి నన్ను మీ ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, రేపటి ఎన్నికల తరువాత నేను కచ్చితంగా నెలకు ఒకసారి అయినా గజ్వేల్ లో పర్యటిస్తాను అని కేసెయార్ ఒట్టేసారు.

తనకు గెలుపు విషయంలో ఎలాంటి అనుమానాలు డౌట్లూ అసలు లేవని ఆయన అన్నారు. అయితే తన మెజారిటీని భారీగా ఇవ్వాల్సింది మాత్రం ప్రజలే అన్నారు. ఆ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. మొత్తానికి కేసీయార్ తనను గెలిపించిన గజ్వేల్ ప్రజల కోసం సొంత నియోజకవర్గానికి రాలేకపోయాను అని ఒప్పేసుకున్నారు.

మరి కేసీయార్ ఈసారి తప్పకుండా వస్తాను అని ఒట్టేశారు కేసీయార్ మాట ఇచ్చారు. గజ్వేల్ అభివృద్ధిలో వెనకబడలేదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా మాత్రమే రాకపోకలు లేవని అన్నారు. తనను గెలిపించాలని ఈసారి పొరపాట్లు ఏవీ రిపీట్ కావని అంటున్నారు. తన మెజారిటీ ప్రజల దయ అని కూడా అంటున్నారు. ఇవన్నీ జనంలోకి ఎక్కి భారీ మెజారిటీతో గెలిపిస్తారని బీయారెస్ వర్గాలు అంటున్నాయి.

అయితే ఇదే పాయింట్ మీద బీజేపీ నేత ఈటెల రాజేందర్ జనంలోకి వెళ్తారని అంటున్నారు. ఈసారి గజ్వేల్ నుంచి కేసీయర్ మీద తాను పోటీ చేస్తాను అని ఆయన అంటున్నారు. తన గెలుపు ఖాయమని కూడా ఈటెల బల్లగుద్దుతున్నారు. మరి గజ్వేల్ ప్రజలకు జనంలో నిత్యం ఉండే ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే కావాలా లేక సీఎం కావాలా అన్నది రేపటి ఎన్నికలు తేల్చబోతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News