కేసీఆర్ ప్రకటనతో కాంగ్రెస్ ఉలిక్కిపడుతుందా ?

‘‘నాతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో పరిస్థితి బాగోలేదు. వస్తామని అన్నారు

Update: 2024-04-20 04:27 GMT

‘‘నాతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో పరిస్థితి బాగోలేదు. వస్తామని అన్నారు. రేవంత్ బీజేపీలోకి పోతాడని చెప్తున్నారు. ఎంఐఎంతో కలుపుకుని 111 స్థానాలు ఉన్నప్పుడే బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించింది. అటువంటిది 65 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తుందా ?’’ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.

‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే సహించేది. బీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది ఉన్నారో రోజూ సాయంత్రం కేసీఆర్ లెక్కపెట్టుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాపలాగా హైటెన్షన్ వైర్ నేను కాపాలాగా ఉన్నాను. బిడ్డా టచ్ చేస్తే మాడి మసైపోతారు’’ అని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించడానికి కారణం కేసీఆర్ వ్యాఖ్యలేనని తెలుస్తున్నది. కాంగ్రెస్ లో నేతల మధ్య ఉన్న విభేధాలే ఈ పరిస్థితులకు కారణంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలోనే రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను రేవంత్ పిలిపించుకున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో రంజిత్ రెడ్డి పార్టీ మారడంపై ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ‘‘పోయిన వాడు పోక .. మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితులలో పార్టీ మారేది లేదు’’ అని అన్నాడు. అలాంటి వ్యక్తి నేరుగా రేవంత్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

తమ విద్యాసంస్థల కూల్చివేత నేపథ్యంలో మేడ్చల్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి. మర్రి రాజశేఖర్ రెడ్డిలు బెంగుళూరులో డీకె శివకుమార్, హైదరాబాద్ లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలను కలిశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా రేవంత్ ను కలిశారు. వీరు కాక టీడీపీలో పనిచేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు, శేేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలను లాగే ప్రయత్నంలో రేవంత్ ఉన్నాడని తెలుస్తున్నది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిది గతంలో కాంగ్రెస్ బ్యాక్ గ్రౌండే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News