కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్ పైన దాడి....రిమాండ్ రిపోర్టు చెప్పింది ఏంటి ?

ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి ఈ కుట్రను పన్నానని పోలీసులు అంటున్నారు.

Update: 2024-11-14 03:56 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద గట్టి ఆరోపణే వచ్చింది. ఆయన ఈ విషయంలో ఎలా సర్దుకుంటారో తెలియదు కానీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులఒ మత్రం చాలా కీలక విషయాలే ఉన్నాయని అంటున్నారు.

కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు లగచర్లలో అధికారుల మీద దాడి జరిగినట్లుగా పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లుగా అంటున్నారు. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి ఈ కుట్రను పన్నానని పోలీసులు అంటున్నారు.

ఇక సురేష్ కి తరచూ ఫోన్ చేసినట్లుగా నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్లుగా కూడా చెబుతున్నారు. నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు ఉండడంతో ఇపుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.అంతే కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగనే కేటీఆర్‌తో పాటు ఇతరుల ఆదేశాలతో అధికార్ల మీద దాడి చేశారు పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

అంతే కాదు కేవలం రాజకీయ కుట్రలో భాగంగనే రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని కూడా చెబుతున్నారు. తన అనుచరుడు భోగమోని సురేష్‌ ద్వారా అందరినీ నరేందర్ రెడ్డి ప్రభావితం చేశారని తెలిపారు. అలాగే కొందరికి డబ్బులు ఇచ్చి దాడికి ఉసిగొల్పారని కూడ పోలీసులు చెప్పుకొచ్చరు. అంతేకాదు కొందరు అధికారులను చంపినా పర్వాలేదని రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారని పోలీసులు పేర్కొనడం విశేషం.

ఏది ఏమైనా ఈ మొత్తం కేసులో కేటీఆర్ పేరు రావడం ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కుట్ర అని రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంతో ఈ వ్యవహారం ఎంతదాకా పోతుంది అన్నది కూడా ఎవరికీ తెలియడం లేదు. కేటీఆర్ అరెస్ట్ అన్నది కొద్ది రోజులుగా ప్రచారం గా ఉంది. అంతే కాదు ఆయన అరెస్ట్ విషయంలో గవర్నర్ అనుమతి కోరారని కూడా అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆయన పేరు ఉందని రిమాండు రిపోర్టులో చూపించడం అంటే తెలంగాణా రాజకీయాల్లో ఏదో జరగబోతోంది అని అంటున్నారు.చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News