కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు వ్యవహారం.. రేవంత్ కీలక నిర్ణయం!
అయితే తాజాగా ఈమెకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ఇందులో భాగంగా... తెరపైకి ట్రాఫిక్ జాం సమస్యను తెచ్చారు
గతకొంతకాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫుడ్ కోర్టు వీడియోల్లో కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు వీడియోలు టాప్ ప్లేస్ లో ఉండేవి! ప్రధానంగా ఇటీవల విడుదలైన ఒక వీడియోతో మరింత పాపులర్ అయ్యింది కుమారి ఆంటీ. మాదాపూర్ ఏరియాలో ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ నడుతూ ఈమె ఫుల్ పాపులర్ అయ్యారు.
అయితే తాజాగా ఈమెకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ఇందులో భాగంగా... తెరపైకి ట్రాఫిక్ జాం సమస్యను తెచ్చారు. ఫలితంగా... ఫుడ్ కోర్టు మూసెయ్యాలని అన్నారు. ఇలా కుమారి అంటీ ఫుడ్ స్టాల్ కు భారీగా జనం తరలి వస్తుండటంతో ట్రాఫిక్ జాం అవుతోందని ట్రాఫిక్ పోలీసులు చెబుతూ.. ఆ ఫుడ్ సెంటర్ ను మూసేయించారు! అయితే, పోలీసులు తమను షాప్ ఎందుకు మూయించారంటూ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో... ఈ ఇష్యూపై రకరకాల కామెంట్లు వినిపించడం మొదలయ్యింది. దీంతో ఈ ఇష్యూపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీకి తెలంగాణ సీఎం శుభవార్త చెప్పారు. ఆ ఫుడ్ సెంటర్ ను కంటున్యూ చేసుకోవచ్చని స్పష్టం చేశారు!
ఈ సందర్భంగా... కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుమారి తన వ్యాపారాన్ని పాత స్థలంలోనే కొనసాగించ్చుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్ ను తాను సందర్శిస్తానని సీఏం తెలిపారు. దీంతో సీఎం రేవంత్ పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి!
కాగా... ఈ ఇష్యూపై టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె షాప్ ని క్లోజ్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడిన ఆయన... తాను తన యూనిట్ తో కలిసి ఆమెకు వీలైనంత మేర సహాయం చేస్తామని తెలిపారు! ఈ సమయంలోనే తెలంగాణ సీఎం స్పందిస్తూ... ఫుడ్ సెంటర్ కంటిన్యూ చేసుకోనివ్వమని అధికారులను ఆదేశించారు!