కూటమి ప్రభుత్వంలో కో ఆర్డినేషన్ లేదా ?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇందులో ముగ్గురు జనసేనకు చెందిన వారు అయితే ఒకరు బీజేపీకి చెందిన వారు. ఇదిలా ఉంటే కూటమి అధికారం చేపట్టి వంద రోజులు కావస్తోంది.
మంత్రుల మధ్య సరైన కో ఆర్డినేషన్ లేదని వారి పనితీరు ఇంకా మెరుగుపడాలని వార్తలు వస్తున్నాయి. వంద రోజులు పూర్తి అయితే మంత్రులకు మార్కులు వేసి ప్రొగ్రెస్ రిపోర్టులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు.
ఇంతలో ఉన్నఫళంగా వరదలు వచ్చాయి. బెజవాడను బుడమేరు ముంచేసింది. బాధితులు లక్షలలో ఉన్నారు. వారికి సహాయ కార్యక్రమాలు చేసేందుకు కూటమి సర్కార్ నడుం బిగించింది. ఈ విషయంలో కూటమిలో కో ఆర్డినేషన్ లేదా అన్న చర్చ వస్తోంది. వరద బాధితులకు ఆహారం అందించేందుకు ఏ ఏ మంత్రిత్వ శాఖలు పని చేయాలి ఏ శాఖ నుంచి ఎన్ని వాహనాలు తరలించాలి ఇవన్నీ కూడా ముందే ప్రిపరేషన్ ఉండాలి.
కానీ పౌరసరఫరాల శాఖ అయితే ముందుకు వచ్చింది. ఆ శాఖ రేషన్ సరకులను ఇంటి వద్ద అదించేందుకు వైసీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన వాహనాలను ఇందుకు ఉపయోగించింది. ఆ విధంగా తెచ్చిన వాహనాలలో నిత్యావసరాలను పంపిణీ చేసింది. అయితే బాధితులు చూస్తే ఎనభై వేల మంది ఉంటే 15 వేల మందికి మాత్రమే ఈ సాయం అందింది అని వార్తలు వచ్చాయి.
దీని మీదనే ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ కార్యకమాల విషయం చూసేందుకు వెళ్తే బాధితులు మాకు ఏ సాయం అందలేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దాంతో అక్కడ ఉన్న మంత్రి నాదెండ్లతో పాటు అధికారులను బాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని వెహికల్స్ పెట్టారు, ఎంత డిస్ట్రిబ్యూషన్ చేశారు అన్నది ఆయన ఆరా తీశారు. స్పీడ్ గా బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయాల్సి ఉండగా ఎందుకు జాప్యం అవుతోందని కూడా ఆయన ప్రశ్నించారు
ఈ సందర్భంగా మంత్రి నారాయణ వల్లనే ఇదంతా జరిగింది అని నాదెండ్ల చెప్పడం జరిగింది. మున్సిపల్ శాఖ వాహనాలు పంపిస్తామని చెప్పి పంపలేదని తమకు అందుబాటులో ఉన్న వాటితోనే ఈ కార్యక్రమాలు చేశామని ఆయన వివరించారు. అయితే ఉద్యాన వన శాఖ ఇతర మంత్రివ శాఖల వద్ద వాహనాలు ఉంటాయి కదా వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు కదా అని సీఎం అన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఒక దశంలో మంత్రి నాదెండ్ల నారాయణ గురించి చెబుతూ ఇది మీకు సంబంధం లేదని మేము చూసుకుంటామని అన్నట్లుగా పేర్కొనడం విశేషం. చంద్రబాబు అయితే ఒక పాలసీ ప్రభుత్వం తీసుకుంటే దానికి అనుగుణంగా మంత్రులు అంతా కలసి కూర్చుని కో ఆర్డినేట్ చేసుకుని ముందుకు పోవాలని చెప్పడం జరిగింది.
ఏది ఏమైనా ముఖ్యమంత్రికి అందిన సమాచారం చూస్తే 20 శాతం ప్రజలకే సాయం అందింది. ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒక ఇష్యూ వచ్చినపుడు ఎలా దానిని అడ్రస్ చేశారు అనేది ప్రధానం. అయితే ఇక్కడ కూడా సహకారంతోనే అంతా సాగాలి. మరి మంత్రుల మధ్య కో ఆర్డినేషన్ లేదా అన్నది కనుక చూస్తే సీఎం మంత్రి నాదెండ్లల మధ్య సంభాషణలు వీడియో ఆడియో లీక్ కావడంతో తెలుస్తోంది అని అంటున్నారు.
ఏది ఏమైనా కూడా సీఎం స్థాయిలో బాబు అయితే పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. దానిని స్పూర్తిగా తీసుకుని మంత్రులు కూడా తమ వంతుగా పనిచేయాల్సి ఉందని అంటున్నారు. కూటమిలో పార్టీలు ఏవి ఉన్నా ప్రభుత్వం మాత్రం ఒక్కటే. కాబట్టి ఆ అవగాహనతో ముందుకు సాగాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సీఎం బాబు నాదెండ్ల సంభాషణలను చూసిన నెటిజన్లు కూడా కో ఆర్డినేషన్ మిస్సింగ్ అని అనుకుంటున్నారు అంటే ఆలోచించాల్సిందే.