సచివాలయాల బాధ్యత ఎవరిది...కూటమి డెసిషన్ అదే ?

వైసీపీ అపర సృష్టి అయిన సచివాలయ వ్యవస్థను ఏమి చేయాలి అన్నది ఆలోచించు కునేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వానికి నాలుగు నెలల సమయం పట్టింది

Update: 2024-10-10 03:12 GMT

వైసీపీ అపర సృష్టి అయిన సచివాలయ వ్యవస్థను ఏమి చేయాలి అన్నది ఆలోచించు కునేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వానికి నాలుగు నెలల సమయం పట్టింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఏపీలోని సచివాలయాల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.

ఏపీలో లక్షా పాతిక వేలమంది పనిచేసే సచివాలయాలు ఏకంగా పదిహేను వేల దాకా ఉన్నాయి. వీటిలో ఒక్కో దానిలో పది మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నారు. అక్టోబర్ 2021 నాటికి, 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు 2,54,832 వాలంటీర్లతో సేవలను ప్రారంభించించి. దాదాపు 3.2 కోట్ల మందికి సేవ చేయడానికి పెన్షన్‌లు, నెలవారీ ప్రభుత్వ పథకాలతో సహా అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు.

ఈ సచివాలయాల నిర్వహణ అన్నది కూటమి ప్రభుత్వానికి భారంగా ఉంది. ఎందుకు అంటే సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. పైగా ప్రతీ రెండు వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. దాంతో సచివాలయాలలో పది మందికి ఇద్దరు ముగ్గురుకి మాత్రమే పని ఉంది అని అంటున్నారు.

వీరి విషయంలో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తేల్చబోతోంది. సచివాలయాలను పంచాయతీలను అప్పగించాలని అనుకుంటోందిట. ఆ విధంగా చేయడం వల్ల వీరి పనితీరు మీద అజమాయిషీ ఉంటుంది అలాగే వారి సేవలను ఏ విధంగా వాడుకోవాలో కూడా పంచాయతీలు చూసుకుంటాయని అంటోంది. మరో వైపు చూస్తే పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను తెచ్చారని, దాని వల్ల పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.

అంతే కాదు సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారిఒపయారు అని అంటున్నారు. ఇపుడు సర్పంచులకు న్యాయం చేయడం వారికే సచివాలయాల మీద పెత్తనం అప్పగించడం చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా పంచాయాతీలకే అధికారాలు నిధులు విధులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది.

ఇక ప్రతీ రెండు వేలకు ఒక సచివాలయం కాకుండా పంచాయతీకి ఒకటి ఉంటే చాలు అన్నట్లుగా నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. మిగిలిన అదనపు సిబ్బందిని కూడా ఇతర ప్రభుత్వ విభాగాలలో సర్దుబాటు చేస్తారు అని అంటున్నారు. పట్టణాలో ఉండే వార్డు సచివాలయాలను కూడా సంఖ్య తగ్గించి అక్కడి సిబ్బందిని కూడా వేరే శాఖలకు సర్దుతారు అని అంటున్నారు. మొత్తానికి సచివాలయాల రూపు షేపూ గతంలో మాదిరిగా ఉండదని అంటున్నారు.

ఇక వాలంటీర్ల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కూడా ఆలోచిస్తారు అని అంటున్నారు.ఏది ఏమైనా సచివాలయాలు వాలంటీర్ల పంచాయతీకి ఒక పరిష్కారం మంత్రి వర్గ సమావేశంలో దొరుకుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News