లాస్య పోస్టుమార్టం రిపోర్ట్ విడుదల... సీఎస్ కు సీఎం సూచనలివే!

అవును... బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్ట్ విడుదలయ్యింది. ఈ నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి.

Update: 2024-02-23 11:35 GMT

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గం బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 37ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదం వల్ల ఆమె మృత్యుఒడికి చేరుకున్నారు. ఈమె మృతిపై ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆమె పోస్టుమార్టం రిపోర్ట్ ను గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

అవును... బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్ట్ విడుదలయ్యింది. ఈ నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని వైద్యులు చెబుతున్నారు! దీంతో కారు ప్రమాదం జరిగిన వెంటనే ఆమె తలకు బలమైన గాయం తగిలిందని పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం వైద్యులు మీడియాకు తెలిపారు.

ఇదే సమయంలో లాస్య నందిత దవడ ఎముక విరిగిందని, ఆ స్థాయిలో దవడకు బలంగా దెబ్బ తగలడంతో ఆరు దంతాలు ఊడిపోయాయాయని.. అదేవిధంగా ఎడమ కాలు ఎముక, ఛాతీ ఎముకలు సైతం విరిగాయని గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం నివేదిక‌లో కీల‌క విష‌యాలు!:

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే తీవ్రత ఎక్కువగా జరిగింది.

దవడ ఎముక విరిగిపోయింది.

ఆరు దంతాలు ఊడిపోయాయి.

ఎడమ కాలు, చాతి ఎముకలు విరిగిపోయాయి.

మెద‌డులో న‌రాలు చిట్లిపోయాయి! దీంతో... ఆమె అక్కడిక‌క్కడే మృతి చెందారు!!

అధికార లాంచనాలతో అంత్యక్రియలు!:

అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందడం పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. సాయన్న చనిపోయి ఏడాది దాటి నాలుగు రోజులకే కూతురు చనిపోవడం బాధాకరమని తెలిపారు. అధికారిక లాంచనాలతోనే ఆమె అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్‌ ను సీఎం ఆదేశించారని తెలిపారు.

Tags:    

Similar News