జగన్ వాడేది ముష్టి దా ?

దాని మీద సాధారణ పరిపాలనా విభాగం నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఫర్నిచర్ వెనక్కి ఇవ్వాలని కోరారు. ఇది మెల్లగా రాజకీయ రాద్ధాంతానికి దారి తీసింది.

Update: 2024-06-20 17:24 GMT

నోటికి ఎంత వస్తే అంత అనేసే మాజీ మంత్రి కొడాలి నాని మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. తన సహజ ధోరణిలో ఆయన నోరు చేసుకున్నారు. ఆయన వైసీపీని జగన్ ని కాసుకువస్తున్నాను అన్న భ్రమలోనే ఇంతకాలం మాట్లాడారు. దాని రిజల్ట్ జనాలు ఇచ్చేశారు. ఇపుడు కూడా ఆయన అదే భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నారు అని అంటున్నారు.

అంటే భారీ ఓటమి తరువాత కూడా వైసీపీ నేతల మాటలో వైఖరిలో మార్పు ఎక్కడా లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగా జగన్ తన సొంత ఇంటిని చేసుకున్నారు. అందులోనే సెక్రటేరియట్ మోడల్ తో ఆఫీసు ని ఏర్పాటు చేశారు. అక్కడ వాడే ఫర్నిచర్ ప్రభుత్వానిది అని కొత్త ప్రభుత్వం అంటోంది.

దాని మీద సాధారణ పరిపాలనా విభాగం నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఫర్నిచర్ వెనక్కి ఇవ్వాలని కోరారు. ఇది మెల్లగా రాజకీయ రాద్ధాంతానికి దారి తీసింది. ఆనాడు స్పీకర్ దివంగత కోడేల శివప్రసాద్ వద్ద ఫర్నిచర్ ఉంటే కేసులు పెట్టారని ఇపుడు జగన్ మీద కేసులు పెట్టాలని కొడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరి కొందరు నేతలు కూడా జగన్ విషయంలో ఈ రకంగానే కామెంట్స్ చేశారు. అయితే దీని మీద మాజీ మంత్రి కొడాలి నాని అయితే జగన్ కి మద్దతుగా మాట్లాడుతూ ముష్టి ఫర్నిచర్ అని చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఫర్నిచర్ ముష్టిదా. మరి అదే అయితే జగన్ ఇన్నాళ్ళూ ఎలా వాడారు అని ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వచ్చి పడుతున్నాయి.

కొడాలి నాని తన ఆవేశాన్ని ఇంకా వదలలేదని అలాగే తాము ప్రభుత్వంలో ఉన్నామనుకునే ఆయన మాట్లాడుతున్నారని ఆయన భాషలో తీరులో మార్పు లేదని అంటున్నారు. జగన్ వాడుతున్న ఫర్నిచర్ అయితే ప్రభుత్వ సొమ్ముగా ఉంది. అలా ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. దానికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సిన మాజీ మంత్రి ముష్టి ఫర్నిచర్ అని మాట్లాడడమేంటి అని కౌంటర్లు పడుతున్నాయి.

అంతే కాదు కేసులు పెడితే సానుభూతి వస్తుందని కొడాలి నాని లాంటి వారు ఈ విధంగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. కానీ ప్రతీ కేసుకూ సానుభూతి రాదు, అలగే ప్రతీ విషయానికీ సెంటిమెంట్ ని ఆపాదించలేము. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నపుడు ఫర్నించర్ వాడుకోవడంలో తప్పు లేదు. ఆయన మాజీ అయ్యాక భద్రంగా ప్రభుత్వానికి చేరవేయాలి. ఇది రూల్.

ఒక వేళ కాకున్నా నోటీసులు ఇచ్చిన తరువాత అయినా ఆ పని చేయాలి. మరి జగన్ ఏమనుకుంటున్నారో తెలియదు కానీ కొడాలి నాని లాంటి వారు అయితే జబర్దస్త్ గా మాట్లాడడమే చేటు తెస్తోంది అని అంటున్నారు. ఈ రకంగానే అయిదేళ్ల పాటు మాట్లాడి వైసీపీ నాశనానికి కారకులు అయ్యారని నాని మీద సొంత పార్టీలోనే సెటైర్లు పడుతున్నాయి. అయినా నాని ఆలోచనలు మారడం లేదని అంటున్నారు. మరి ఆయనను అదుపులో పెట్టాల్సిన జగన్ ఇపుడు కూడా ఇదే తీరున ఊరుకుంటే మరింత నష్టం తప్ప లాభం లేదని అంటున్నారు.

Tags:    

Similar News