సెక్స్ రాకాసి: హెచ్ ఐవీ తేలాక 200మందికి అంటించింది
అంతేకాదు.. ఆమెతో శ్రంగారంలో పాల్గొన్న స్థానికులను అప్రమత్తం చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఒక సెక్స్ వర్కర్ విపరీత చేష్ట అమెరికాలో షాకింగ్ గా మారింది. తనకు హెచ్ఐవీ సోకినట్లు తేలిన తర్వాత.. 200 మందితో సెక్సు చేయటం ద్వారా వారందరికి తన హెచ్ ఐవీని అంటించిన కిరాతకం తాజాగా వెలుగు చూసింది. ఈ దుర్మార్గానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు తాజాగా ఆమెను అరెస్టు చేశారు. అమెరికాలో తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతం ఒహైయో రాష్ట్రంలో వెలుగు చూసింది. అంతేకాదు.. ఆమెతో శ్రంగారంలో పాల్గొన్న స్థానికులను అప్రమత్తం చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
మరియోట్టాకు చెందిన లిండా లెచెసే ఒక సెక్సు వర్కర్ గా పని చేస్తున్నారు. స్థానిక మార్కెట్ లో ఆమె పలువురిని ఆకర్షిస్తూ ఉండేది. 2022 జనవరినుంచి ఇప్పటివరకు ఆమె అనేకమందితో లైంగిక సంబంధాల్ని నడిపింది. అనారోగ్యానికి గురైన ఆమె పరీక్షలు చేయించుకోగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆ తర్వాత కూడా ఆమె పలువురితో తన లైంగిక కార్యకలాపాల్ని కొనసాగించింది. రెండున్నరేళ్ల కాలంలో 211 మందితో ఆమె సెక్సు జరిపినట్లుగా గుర్తించారు.
తాజాగా ఆమె గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అదే సమయంలో ఒక నోటీసును జారీ చేశారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారంతా తక్షణమే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. స్థానికులు మాత్రమే కాదు పొరుగు రాష్ట్రాల వారు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఆమెను విచారించిన అధికారులు..ఆమె క్లయింట్ల వివరాల్ని సేకరించారు. వారికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి విషయాల్ని తెలపటమే కాదు.. ఆమెతో సంబంధాలు ఉన్న వారు ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని కోరుతున్నారు. ఆమె తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది.