పాదయాత్రకు ముందే లోకేష్ అరెస్ట్....?
నారా లోకేష్ అరెస్ట్ కి రంగం సిద్ధం అయింది. ఫైబర్ నెట్ స్కాం లో ఆయన పేరుని చేర్చిన ఏపీ సీఐడీ అధికారులు తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఆ 14 గా చేర్చారు.
నారా లోకేష్ అరెస్ట్ కి రంగం సిద్ధం అయింది. ఫైబర్ నెట్ స్కాం లో ఆయన పేరుని చేర్చిన ఏపీ సీఐడీ అధికారులు తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఆ 14 గా చేర్చారు. అంతే కాదు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దీని మీద పిటీషన్ దాఖలు చేశారు.
ఇక ఈ కేసులో చూసుకుంటే ఇప్పటికే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పేరు కూడా ఉంది. ఇలా ఈ రెండు కేసుల్లో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ ఇప్పటికే న్యాయస్థానాల్లో అనుమతి కోరుతూ పిటిషన్ వేసింది. లోకేష్ ను కూడా నిందితుడిగా చేర్చడం లేటెస్ట్ గా జరిగింది.
ఈ పరిణామాల నేపధ్యంలో లోకేష్ ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వచ్చే వారం నుంచి అంటే అక్టోబర్ 2 నుంచి లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు అని పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ప్రకటించారు. లోకేష్ సైతం టీడీపీ నేతల టెలి కాన్ఫరెన్స్ లో ఇదే విషయం చెప్పారు.
అయితే లోకేష్ పాదయాత్రకు అటెండ్ కాకుండానే అరెస్ట్ ఉండవచ్చు అని అంటున్నారు. సుప్రీం కోర్టులో చాంద్రబాబు పేరిట ఆయన తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ కేసు విషయంలో ఏమి జరుగుతుందో చూసుకుని ఆ మీదటనే ఢిల్లీ నుంచి బయల్దేరి రావడానికి లోకేష్ రెడీ అవుతున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో లోకేష్ ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుంటారని తెలుస్తోంది. దాంతో సీఐడీ అధికారులు ఆయనను రాజమండ్రి దగ్గరే అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ అన్నది సుప్రీం కోర్టు తోసిపుచ్చితే ఇక లోకేష్ అరెస్ట్ ని ఎవరూ ఆపలేరని కూడా అంటున్నారు.
ఏది ఏమైనా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం అయ్యేది లేకుండానే అరెస్ట్ చేస్తారని అంటున్నారు. ఈ విషయాల మీద అవగాహన ఉందో ఏమో తెలియదు కానీ తన పాదయాత్ర అంటే వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది అని లోకేష్ ట్విట్టర్ ద్వారా తాజాగా విమర్శించారు. తాను పాదయాత్ర చేపడతాను అని గతంలో ప్రకటిస్తే జీవో నమబర్ వన్ ని తెచ్చారని, ఇపుడు ఏ 14 అంటూ లేని దాని మీద కేసు పెట్టారని ఆయన మండిపడుతున్నారు.
అయితే లోకేష్ అరెస్ట్ మాత్రం పక్కా అని అంటున్నారు. ఆయనను ఫైబర్ నెట్, స్కిల్ స్కాం తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ వంటి మూడు కేసులలోనూ నిందితునిగా చూపించడమే దీనికి ఉదాహరణ అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు జైలులో ఉండి, లోకేష్ కూడా అరెస్ట్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల వేడి వేసవి ధాటినే తలపించగలదు అని అంటున్నారు.