అసలు పేరు చెప్పకపోవడంతో ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు
అధికారులకు ఎదురైన ఈ పరిస్థితితో చాలా మంది ఓటర్లు తమ పేర్లు పోగొట్టుకున్న పరిస్థితి వారికి ఓటు హక్కు లేకుండా చేసింది
దేశంలో తొలి లోక్ సభ ఎన్నికల్లో అధికారులకు ఓ వింత పరిస్థితి ఎదురైంది. ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేర్లు చెప్పకపోవడంతో వారి పేర్లు ఓటరు జాబితాలో కనిపించకుండా పోయాయి. వారి సంప్రదాయం ప్రకారం ఫలాలా వ్యక్తి భార్యననో, లేక ఫలానా తండ్రి కూతురుననో చెప్పడంతో వారి పేర్లు జాబితాలో చేర్చలేదు.
అధికారులకు ఎదురైన ఈ పరిస్థితితో చాలా మంది ఓటర్లు తమ పేర్లు పోగొట్టుకున్న పరిస్థితి వారికి ఓటు హక్కు లేకుండా చేసింది. ఈ సమస్య బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎదురుకావడం గమనార్హం. ఇలా పేర్లు చెప్పకపోవడంతో 28 లక్షల ఓటర్లు నమోదు కాకుండా పోవడం జరిగింది. తమ అసలు పేర్లు చెప్పకపోవడంతో వారికి ఓటు హక్కు లేకుండా పోయింది.
సనాతన సంప్రదాయం ప్రకారం భర్తల పేర్లు భార్యలు చెప్పకూడదు. ఆ ఆచారాన్ని వారు ఇప్పటికి కూడా పాటిస్తున్నారు. నాగరికత మారింది. ప్రపంచం ఎక్కడకో పోతోంది. ఈ కాలంలో కూడా అలాంటి ఆచారాలు ఉండటంతో వారికి నష్టమే ఎదురైంది. ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారు. వారి అమూల్యమైన హక్కు లేకుండా పోవడంతో మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికి కూడా ఇలాంటి ఆచార, సంప్రదాయాలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వారి ఒరిజనల్ పేర్లు చెప్పకుండా దాచడం వల్ల వారికి ఓటు హక్కు రాకుండా పోవడంతో వారి ఓటు విలువ పోయింది. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఎంతో విలువ ఉంటుందనే విషయం వారు గుర్తించలేదని చెబుతున్నారు. ఈక్రమంలో వారికి మళ్లీ ఓటు హక్కు ఎప్పుడొస్తుందో తెలియడం లేదు.
సంప్రదాయాల ముసుగులో వారు చేసింది ముమ్మాటికి తప్పే. ఓటు నమోదు చేసుకునే సందర్భంలో వారి పేర్లు చెప్పకుండా దాచి పెట్టడం వల్ల వారి ఓటుహక్కు దూరం అయింది. ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు నమోదు కాకుండా పోవడంతో ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి ఓటుహక్కు ఎప్పుడు తెచ్చుకుంటారోననే వాదనలు వస్తున్నాయి.