లులూ ఛైర్మన్ మరో సర్ ప్రైజ్.. పలుకరించి మరీ సెల్ఫీ

ఈ విశేషాల్ని ప్రస్తావిస్తూ సదరు మహిళ.. తన పనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Update: 2024-09-08 04:40 GMT

ఎత్తుకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమంటారు. ఈ మాటకు నిలువెత్తు రూపంగా కొందరు నిలుస్తుంటారు. ఆ కోవకే వస్తారు లులూ షాపింగ్ మాల్ ఛైర్మన్ ఎం.ఎ. యూసఫ్ అలీ. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లులూ గ్రూప్ నకు భారీ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ చైన్ సూపర్ మార్కెట్లకు యూసఫ్ అలీ ఛైర్మన్ కం ఎండీగా వ్యవహరిస్తుంటారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన ఆస్తి 8.9 బిలియన్ డాలర్లు. అయినప్పటికీ ఆయన చాలా సింఫుల్ గా ఉంటారు. అన్నింటికి మించి ఊహించని విధంగా రియాక్టు అవుతూ అందరి మనసుల్ని దోచేస్తుంటారు. తరచూ పాజిటివ్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యూసఫ్ వినయం నెటిజన్లను భారీగా ఆకట్టుకుంటోంది. ఇంతకూ జరిగిందేమంటే.. అబుదాబీలో ఒక షాపింగ్ మాల్ లో యూఏఈకి చెందిన చంద్రశేఖరన్ పుతురుతి అనే మహిళ తన వాళ్లతో కలిసి వెళుతున్నారు. ఆమె ముందుగా లులూ మాల్ ఛైర్మన్ నడుచుకుంటూ వెళుతున్నారు. వెంటనే.. ఆమె పరుగులాంటి నడకతో.. యూసఫ్ అలీతో కలిసి వీడియో తీసుకోవటానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి.

ఈ విషయాన్ని గుర్తించిన యూసఫ్.. తానే స్వయంగా సదరు మహిళ వద్దకు వచ్చి.. ఆమెతో కలిసి ఫోటో దిగారు. సెల్ఫీ వీడియోకు టైమిచ్చారు. ఈ విశేషాల్ని ప్రస్తావిస్తూ సదరు మహిళ.. తన పనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు.. సదరుయువతి తన పోస్టులో ఆసక్తికర వ్యాఖ్యల్ని చేశారు. జీవితంలో ఎంత గొప్ప స్థానానికి వెళ్లినా ఇతరులతో వినయపూర్వకంగా వ్యవహరించే గొప్ప వ్యక్తిని తాను కలుసుకున్నట్లుగా పేర్కొన్నారు.

భారత బిలియనీర్ ను కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందన్న ఆమె.. తన వీడియోను షేర్ చేసింది. ‘‘ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయనకు నేను వీరాభిమానిని’’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవలే ఆయన మరో సర్ ప్రైజ్ కు తెర తీయటం తెలిసిందే. తన అభిమాని.. యూట్యూబర్ ఎపిన్ కు రూ.2 లక్షల విలువైన వాచ్ ను గిఫ్టుగా ఇవ్వటం.. దానికి సంబంధించిన వీడియో సైతం వైరల్ గా మారింది.

Tags:    

Similar News